ఆకాష్ పూరి ‘రొమాంటిక్’ ట్రైలర్ రిలీజ్ చేసిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్

October 19, 2021

ఆకాష్ పూరి ‘రొమాంటిక్’ ట్రైలర్ రిలీజ్ చేసిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్

యంగ్ హీరో ఆకాష్ పూరి, అందాల హీరోయిన్ కేతిక శర్మ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న‌ రొమాంటిక్ చిత్రం అక్టోబర్ 29 విడుదల కాబోతోంది. ఈ రోజు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది.

2నిమిషాల10 సెకండ్ల నిడివిగ‌ల ఈ ట్రైల‌ర్‌ను గ‌మనిస్తే… రొమాంటిక్ టైటిల్‌కు న్యాయం చేసేలా ఉంది. ఆకాష్ పూరి, కేతికల మధ్య రొమాంటిక్స్ సీన్స్ పుష్కలంగా ఉన్నాయ‌ని తెలుస్తోంది. స్వచ్చమైన ప్రేమకు, శరీరాన్ని చూసి పుట్టే ప్రేమకు మధ్య ఉండే తేడాను ఈ సినిమాలో చూపించినట్టు కనిపిస్తోంది.

వాస్కో పాత్రలో ఆకాష్ పూరి, మౌనిక క్యారెక్టర్‌లో కేతిక శర్మ రొమాంటిక్స్ సీన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యేలా ఉన్నారు. కేతిక శర్మ తన అందాలతో కుర్రకారును కట్టిపడేసేలా ఉంది. రమ్యకృష్ణ పోలీస్ ఆఫీసర్ పాత్రలో క‌నిపించింది.

పూరి జగన్నాథ్ రాసిన డైలాగ్స్ రొమాంటిక్ చిత్రానికి ప్లస్ అవ‌నున్నాయి. మొత్తంగా రొమాంటిక్ ట్రైలర్ యూత్‌ను ఆకట్టుకునేలా ఉంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. అక్టోబర్ 29న ఈ చిత్రం విడుదలకానుంది.

https://t.co/p7DYiWV0tS