September 26, 2021
తళపతి విజయ్ అంటేనే రికార్డుల రారాజు. బాక్సాఫీస్ కలెక్షన్ల రికార్డులు బద్దలు కొట్టడంలోనే కాదు.. సోషల్ మీడియాలోనూ ఈ తమిళ స్టార్‌కు క్రేజ్ ఒక రేంజ్లో ఉంటుంది. ఏ సినిమా ట్రైలర్ విడుదలైనా అది క్షణాల్లో ట్రెండింగ్‌లోకి దూసుకెళుతుంది. తమిళ్‌తో పాటు తెలుగులో కూడా విజయ్‌కి మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం విజయ్ తన 65వ సినిమా బీస్ట్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు.
విజయ్ తన 66వ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్నారు. ఈ చిత్రాన్ని
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించనున్నారు. సినిమా రంగం పట్ల అభిరుచి, నైపుణ్యం కలిగిన వ్యక్తుల కాంబినేషన్‌తో ఈ సినిమా ఒక క్రేజీ ప్రాజెక్ట్‌గా మారింది. ఈ ప్రాజెక్ట్ పై అటు ప్రేక్షకుల్లో ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో విపరీతమైన బజ్ నెలకొని ఉంది. ప్రస్తుతం విజయ్ నెల్సన్ దర్శకత్వంలో చేస్తోన్న బీస్ట్
పూర్తికాగానే ఈ చిత్రం ప్రారంభమవుతుంది. ప్రముఖ నటీనటులు మరియు అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నారు.