హాట్‌స్టార్‌లో హీరో నితిన్ ‘మాస్ట్రో’ స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే..?

August 30, 2021

హాట్‌స్టార్‌లో హీరో నితిన్ ‘మాస్ట్రో’ స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే..?

నితిన్ తాజా చిత్రం ‘మాస్ట్రో’. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం డిస్నీ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతున్న‌ సంగ‌తి తెలిసిందే. హీరో నితిన్ ల్యాండ్ మార్క్‌గా న‌టిస్తోన్న 30వ చిత్రమిది. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 17న స్ట్రీమింగ్ కానుంది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ విడుద‌ల చేసిన పోస్ట‌ర్‌లో హీరో నితిన్ న‌ల్ల‌టి క‌ళ్ల‌ద్దాలు ధ‌రించి చేతిలో క‌ర్ర ప‌ట్టుకుని న‌డుస్తున్నాడు.

హిందీలో మంచి విజ‌యం సాధించిన అంధాదున్ చిత్రానికి ఇది అఫీషియ‌ల్ రీమేక్‌. మేర్లపాక గాంధీ ద‌ర్శ‌కుడు. రాధిక ఆప్టే పాత్ర‌ను న‌భ న‌టేశ్ పోషిస్తుండ‌గా క‌థ‌లో అతి కీల‌క‌మైన ట‌బు పాత్ర‌ను మిల్కీబ్యూటీ త‌మ‌న్నా పోషిస్తోంది. మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ఠ్‌ మూవీస్ బ్యానర్ పై ఎన్.సుధాకర్ రెడ్డి – నికిత రెడ్డి సంయుక్తంగా నిర్మించారు