విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్, ‘లైగర్‌’లో ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత బాక్స‌ర్ మైక్ టైస‌న్‌

September 27, 2021

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్, ‘లైగర్‌’లో ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత బాక్స‌ర్ మైక్ టైస‌న్‌

విజయ్ దేవరకొండ నటిస్తోన్న ఫస్ట్ పాన్ ఇండియన్ మూవీ లైగర్ (సాలా క్రాస్ బ్రీడ్). డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

తాజాగా ఈ చిత్రం నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. బాక్సింగ్‌లో లెజెండ్ మైక్ టైసన్ మొదటి సారిగా ఈ సినిమా ద్వారా ఇండియన్ స్క్రీన్‌కు పరిచయం కాబోతోన్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత బాక్స‌ర్, బాక్సింగ్‌లో లెజెండ్ అయిన మైక్ టైసన్ గారిని లైగర్ సినిమా ద్వారా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీదకు తీసుకురావడం ఎంతో అద్భుత‌మైన విష‌యం అని చిత్ర యూనిట్ పెర్కొంది.

బాక్సింగ్‌లో తన పంచులతో ఎంతో మంది ప్రత్యర్థులను నేలకు ఒరిగించిన మైక్ టైసన్ ఇప్పుడు లైగర్ చిత్రంలో నటించబోతోన్నారు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ఎంతో నైపుణ్యం కలిగిన ఐరన్ మైక్ పాత్రలో ఆయన కనిపించబోతోన్నారు. ప్రస్తుతం లైగర్ చిత్రీకరణ గోవాలో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో యాక్షన్ సీక్వెన్స్‌లను తెరకెక్కిస్తోంది చిత్రయూనిట్.

బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మళయాలి భాషల్లో రూపొందిస్తున్నారు.