September 2, 2021
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సినీరాజకీయ వర్గాల నుంచి బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ పవన్ ఫ్యాన్స్ కి ఊహించని ఓ స్పెషల్ ట్రీట్ ప్లాన్ చేశారు.
అప్పట్లో జల్సా సినిమా ప్రమోషన్స్ కోసం దేవీశ్రీ ప్రసాద్ పై ఒక ప్రమోషనల్ సాంగ్‌ని రెడీ చేశారు. కానీ అది విడుదల కాలేదు. ఆ వీడియోని దేవీశ్రీ విడుదలచేసి పవన్ ఫ్యాన్స్‌ని ఖుషీ చేశారు.
జల్సా టైటిల్ సాంగ్ కి రాక్ స్టార్ దేవీశ్రీ స్టెప్పులేస్తున్న ఈ వీడియో ఇలా రిలీజైందో లేదో అలా ఇంటర్నెట్లో నిజంగా సునామీ సృష్టిస్తోంది. దేవీశ్రీ రాకింగ్ స్టెప్స్ కి అభిమానులు విజిల్స్ వేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తదుపరి సినిమాకి దేవీ సంగీతం అందించేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఆ పాట ఎలా ఉందో మీరు చూసేయండి..