September 4, 2021
పూరి జగన్నాధ్ తన కుమారుడు ఆకాష్ పూరి కోసం స్టోరీ, స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ అందిస్తోన్న చిత్రంరొమాంటిక్
. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ మరియు పూరి కనెక్ట్స్ బ్యానర్‌లపై పూరి జగన్నాధ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
క్యాచీ టైటిల్ మరియు ఇప్పటివరకు విడుదలైన రొమాంటిక్ పోస్టర్స్‌తో ఈ సినిమాకు మంచి బజ్ ఏర్పడింది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఎలాంటి కట్స్ చెప్పకుండా సెన్సార్ వారు ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చారని చిత్ర యూనిట్ తెలిపింది.
ఈ సందర్భంగా మరో రొమాంటిక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్..ఆ పోస్టర్లో కేతిక శర్మను వెనకనుండి గట్టిగా హత్తుకున్నాడు ఆకాశ్. ఈ పోస్టర్ కూడా యూత్‌లో హీట్ పెంచుతోంది. ఈ మూవీ ఈ నెలాఖరున థియేటర్స్‌లో విడుదలకానుంది. రమ్యకృష్ట ఒక కీలకపాత్రలో నటించింది.