సెప్టెంబర్ 17న విజ‌య్‌ ఆంటోని `విజ‌య రాఘ‌వ‌న్‌`

September 3, 2021

సెప్టెంబర్ 17న విజ‌య్‌ ఆంటోని `విజ‌య రాఘ‌వ‌న్‌`

సెప్టెంబర్ 17న విజ‌య్‌ ఆంటోని విజ‌య రాఘ‌వ‌న్‌..

`న‌కిలీ, డా.సలీమ్‌, బిచ్చగాడు, భేతాళుడు, ఇంద్రసేన, రోషగాడు, కిల్లర్‌` వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో విజయ్‌ ఆంటోని. ఈయన హీరోగా.. `మెట్రో` వంటి డిఫరెంట్‌ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్‌ ఆనంద కృష్ణన్‌ తెరకెక్కించిన చిత్రం ‘విజయ రాఘవన్‌’.  ఇన్ఫినిటీ ఫిల్మ్‌ వెంచర్‌ సమర్పణలో చెందూర్ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై టి.డి.రాజా, డి.ఆర్‌.సంజయ్‌ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.  కోడియిల్ ఒరువ‌న్‌` పేరుతో త‌మిళంలో.. `విజ‌య రాఘ‌వ‌న్‌`పేరుతో తెలుగులో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న ఈ సినిమాను సెప్టెంబర్ 17న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. 

ఓ మాస్ ఏరియాలో పిల్ల‌లు ప‌క్క దారులు ప‌ట్ట‌కుండా … చ‌దువు గొప్ప‌త‌నాన్ని వారికి వివ‌రించి, వారి ఉన్న‌తికి పాటు ప‌డే యువ‌కుడి క‌థే విజ‌య్ రాఘ‌వ‌న్‌. ఎప్పుడో విడుద‌ల కావాల్సిన సినిమా కోవిడ్ కార‌ణంగా వాయిదా ప‌డింది. ఇప్పుడు సినిమాను సెప్టెంబర్ 17న ప్రేకకుల ముందుకు తీసుకొస్తున్నాం“ అని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.