September 1, 2021
తెలుగు. తమిళం, కన్నడం, మలయాళ భాషల్లో అగ్ర కథానాయికగా వెలుగొందిన నటి త్రిష, ప్రస్తుతం సెకండ్ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ఇప్పటి హీరోయిన్స్‌తో పోటీపడుతోంది. ప్రస్తుతం ఈమె చేతిలో ‘పొన్నియిన్ సెల్వన్’, ‘చదురంగ వేట్టై-2’, ‘రాంగీ’, ‘గర్జనై’ వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో ఒక్క ‘పొన్నియిన్ సెల్వన్’ మినహా మిగిలిన చిత్రాల షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్య క్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంలోని త్రిష భాగం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే ఆ సినిమా తర్వాత త్రిష ఏలాంటి కథలు వినడంలేదట. దానికి త్వరలోనే పెళ్ళి పీటలెక్కనుందని సమాచారం. ఇదే విషయాన్ని ఆమెకు సన్నిహిత వర్గాలు కూడా వెల్లడించాయి. గతంలో వరుణ్ మణియన్ అనే బిజినెస్‌మేన్‌తో త్రిషకు నిశ్చితార్థం జరిగింది. కానీ, కొన్ని రోజుల తర్వాత ఈ ఎంగేజ్‌మెంట్‌ను రద్దు చేసుకున్నారు. అప్పటి నుంచి త్రిష తిరిగి సినిమాలపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం మరోసారి ఆమె పెళ్లి వార్త హాట్ టాపిక్ గా మారింది.