Alia Bhatt: ప్యాన్‌ ఇండియన్ యాక్ట్రెస్ అవ్వాల‌నేది నా డ్రీమ్‌

February 20, 2022

Alia Bhatt: ప్యాన్‌ ఇండియన్ యాక్ట్రెస్ అవ్వాల‌నేది నా డ్రీమ్‌

ఆలియాభ‌ట్‌…ఆర్ఆర్ఆర్‌లో హీరోయిన్‌గా ఎంపికైన‌ప్ప‌టి నుండి ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో కూడా మారు మ్రోగుతూనే ఉంది.

తాజాగా ఎన్టీఆర్‌ – కొర‌టాల శివ(#NTR30)లో కూడా హీరోయిన్‌గా క‌న్ఫ‌ర్మ్ అయింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో ఆలియాభ‌ట్‌(Alia Bhatt) టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం గంగూబాయి కథియావాడి (Gangubai Kathiawadi) చిత్రం తెలుగులో కూడా విడుద‌ల‌కి సిద్ద‌మైంది. బాలీవుడ్ విజనరీ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌ల‌కానుంది. ఈ సంద‌ర్భంగా ఆలియాభ‌ట్(Alia Bhatt) చెప్పిన విశేషాలు..

బ్లాక్ సినిమా ఆడిష‌న్స్‌కి వెళ్లాను

సంజయ్ స‌ర్ ఈ పాత్రను నాకు ఆఫర్ చేసినపుడు నేను చేయగలనా? అని చాలా భ‌య‌ప‌డ్డాను. నాకు తొమ్మిదేళ్ల వ‌య‌సున్న‌ప్పుడు సంజయ్ స‌ర్ బ్లాక్ సినిమా ఆడిష‌న్స్‌కి వెళ్లాను. ఆయ‌న నన్ను చూసి నవ్వుతూ.. ఇది హీరోయిన్ క్యారెక్టర్ అని అన్నారు.
ఆయ‌న‌ ఏం చెప్తే అదే చేశాను
ఆయ‌న‌ని ఫ‌స్ట్‌టైమ్ చూసిన‌ప్పుడు అదే గుర్తొచ్చింది. ఆ త‌ర్వాత నా భయాన్ని సంజ‌య్ స‌ర్‌ తో షేర్ చేసుకున్నా. దానికి ఆయన అన్నీ నేను చూసుకుంటాను నువ్వేం భ‌య‌ప‌డ‌కు అని చెప్పారు. అప్పుడే డిసైడ్ అయ్యాను. ఆయ‌న‌ ఏం చెప్తే అదే చేయాలి అని..
అదే ఛాలెంజింగ్‌
నేను కొంచెం స‌న్న‌గా ఉంటాను. నా వాయిస్‌లో కూడా అంత బేస్ ఉండ‌దు. ఈ రెండింటిని అధిగ‌మిం చ‌డం కోసం గుజ‌రాతీ స్టయిల్ మాడ్యులేషన్ ప్రాక్టీస్ చేసాను. మంచి ఫుడ్ తిన్నాను. పాత్రకు త‌గ్గ‌ట్టుగా ఈ రెండు మార్చుకోవ‌డం ఛాలెంజింగ్ విష‌యం.
లైఫ్ టైమ్ అచ్యూవ్ మెంట్‌
సంజ‌య్ స‌ర్‌తో సినిమా చేయడం అన్నది నా డ్రీమ్. ఆయన సినిమాలో చిన్న పాత్ర ఇచ్చినా నేను చేస్తాను. ఆయనతో పని చేయడం వన్స్ ఇన్ లైఫ్ టైమ్ అచ్యూవ్ మెంట్‌.
మెలమెల్లగా మారాను
నేనుఫ‌స్ట్‌టైమ్‌ కథియావాడీ సెట్ లోకి అడుగుపెట్టాకే తెలిసింది అక్క‌డ‌ ఇలా వుంటుదీ అని. అప్ప‌టినుండి నుంచి మెలమెల్లగా ఆ పాత్రలోకి మారడం మొదలుపెట్టాను.
ఆ క్రెడిట్ ఆయ‌న‌దే..
నన్ను పూర్తిగా గంగూభాయ్ గా మార్చింది సంజ‌య్ స‌ర్‌. ఒక దశలో ఇంటికి వెళ్లాక కూడా గంగూ భాయ్ పాత్ర నన్ను వెంటాడేది. గంగూభాయ్ పాత్రను అలా మలిచిన క్రెడిట్ అంతా ఆయనదే.
యూనివ‌ర్స్‌ల్ క‌థ
ఇది స్టోరీ ఆఫ్ ఎ ఫైటర్. త‌ను ఎంచుకున్న వృత్తి చెడ్డ‌ది కావచ్చు..కాని ఆమె బాధ, ఎమోషన్, పోరాటం అన్నింటిలో నిజాయితి ఉంటుంది. ఇది యూనివ‌ర్స్‌ల్ క‌థ..ఎవ్వరికైనా కనెక్ట్ అవుతుంది
అద్భుతమైన ఫీలింగ్‌
అజ‌య్ దేవ్ గన్ గారితో నటించడం అద్భుతమైన ఫీలింగ్‌. ఆయనది చాలా మంచి పాత్ర. గంగూభాయ్ జీవితాన్ని మలుపు తిప్పే పాత్ర. ఆయన నుంచి ప్రొఫెషనలిజం కూడా నేర్చుకున్నాను.
అదే నా డ్రీమ్‌..
ప్యాన్‌ ఇండియన్ యాక్ట్రెస్ అవ్వాల‌నేది నా డ్రీమ్‌…శ్రీదేవి గారు నాకు ఇన్స్‌పిరేష‌న్‌. న‌టీన‌టుల‌కు భాష అడ్డంకి కాదు అని నేను న‌మ్ముతాను అని చెప్పుకొచ్చింది
ReadMore: Project K : ప్ర‌భాస్ క‌ల నిజ‌మైంది

Related News

ట్రెండింగ్ వార్తలు