ఆగ‌స్ట్‌లో `గ‌ల్లీరౌడి`గా రానున్న సందీప్ కిష‌న్

July 27, 2021

ఆగ‌స్ట్‌లో `గ‌ల్లీరౌడి`గా రానున్న సందీప్ కిష‌న్

హీరో సందీప్ కిష‌న్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం గ‌ల్లీరౌడీ. కోన వెంకట్ ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హిరించ‌డ‌మే కాకుండా స్క్రీన్‌ప్లేను కూడా అందించారు. కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా పతాకాలపై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఇటీవ‌ల‌ సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ‘యు/ఎ’ సర్టిఫికేట్‌ పొందింది. కోలీవుడ్ యాక్టర్ బాబీ సింహ విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. నేహ శెట్టి హీరోయిన్‌. ‘గల్లీ రౌడీ’ సినిమాను ఆగస్ట్‌లో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది.