మేఘ ఆకాశ్ పై రామ్‌గోపాల్ వ‌ర్మ సెన్సేష‌న‌ల్ కామెంట్స్‌…

August 30, 2021

మేఘ ఆకాశ్ పై రామ్‌గోపాల్ వ‌ర్మ సెన్సేష‌న‌ల్ కామెంట్స్‌…

మేఘ ఆకాశ్ ప్రధాన పాత్ర‌లో రూపొందుతోన్న చిత్రం ‘డియర్ మేఘ`. క‌న్న‌డ‌లో రూపొందిన దియా(2020) సినిమాకి ఇది అన్అఫీషియ‌ల్ రీమేక్‌. అర్జున్ దాస్యన్ నిర్మించిన ఈ సినిమాకి సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహించాడు. కథానాయకులుగా ఆదిత్ అరుణ్ – అర్జున్ సోమయాజుల నటించారు. 3వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవ‌ల‌ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ సినిమా నటీనటులు .. సాంకేతిక నిపుణులతో పాటు రామ్ గోపాల్ వర్మ కూడా హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా వర్మ మాట్లాడుతూ హీరోయిన్ మేఘ ఆకాశ్‌పై సెన్సేష‌న‌ల్ కామెంట్స్ చేశారు.

`మేఘ ఆకాశ్ నా మార్క్ హీరోయిన్ కాదు. ఆమె చాలా హోమ్లీగా .. క్యూట్ గా ఉంటుంది. 40 ఏళ్ల క్రితం నాకు ఇలాంటి అమ్మాయి దొరికితే నేను డైవర్స్ తీసుకుని ఉండేవాడిని కాదు. ‘రక్తచరిత్ర’ సినిమాలో మాదిరిగా ఒక పదిమందిని చంపేసి నేను ఆమెను ఎత్తుకుని వెళ్లిపోయి ఉండేవాడిని. మేఘ నిజంగా చాలా స్వీట్ .. ఆమెను కలిసిన వాళ్లకి డయాబెటిస్ వస్తుందేమో అనిపిస్తుంది అని అన్నారు అలాగే హీరో అదిత్ గురించి మాట్లాడుతూ అరుణ్ ని మేఘ స్థాయిలో పొగిడితే నన్ను ‘గే’ అనుకుంటారు కాబట్టి నేను ఆ పని చేయడం లేదు అని చెప్పుకొచ్చారు. వర్మ తన గురించి మాట్లాడుతూ ఉంటే మేఘ ఆకాశ్ స్టేజ్ పై ముసిముసినవ్వులు నవ్వుతూ సిగ్గుపడిపోయింది.