సంక్రాంతికి ప‌వ‌న్‌ సినిమా..

July 27, 2021

సంక్రాంతికి ప‌వ‌న్‌ సినిమా..

మలయాళంలో హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కొశియ‌న్’ చిత్రాన్ని తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి కాంబినేష‌న్లో రీమేక్ చేస్తున్న విష‌యం తెలిసిందే..’#PSPKRana’ వర్కింగ్ టైటిల్ తో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రానికి సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తుండ‌గా ప‌వ‌న్‌స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే – డైలాగ్స్ అందిస్తున్నారు. సోమవారం ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ఈ మూవీలో ‘భీమ్లా నాయక్’ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కనిపించనున్నార‌ని తెలిపిన మేక‌ర్స్ తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. దీంతో పాటు ఫ్యాన్స్‌ను మ‌రింత‌ ఖుషీ చేసే మ‌రొక అప్‌డేట్ ఇచ్చారు.

ఈ చిత్రాన్ని 2022 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అధికారికంగా తెలిపారు. ఈ సంద‌ర్భంగా రిలీజ్‌చేసిన మేకింగ్‌వీడియోలో ‘భీమ్లా నాయక్` గా ప‌వ‌న్ స్టైలీష్ పోలీసాఫీస‌ర్‌గా క‌నిపించి ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పించారు. ఈ వీడియోలో రానా, త్రివిక్ర‌మ్‌ని కూడా మ‌నం చూడొచ్చు. నిత్యామీనన్, ఐశ్వర్య రాజేష్ హీరోయ‌న్స్‌గా నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.12 గా సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం, నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఈ సంక్రాంతికి ఇప్ప‌టికే మ‌హేష్ స‌ర్కారు వారి పాట కూడా సంక్రాంతికే విడుద‌ల‌వుతున్న సంద‌ర్భంలో ఎవ‌రు ఎన్ని రికార్డులు క్రియేట్ చేయ‌బోతున్నారో వేచి చూడాల్సిందే..