August 30, 2021
పవర్‌స్టార్ పవన్‌కళ్యాన్, రానా దగ్గుబాటి ల క్రేజీ కాంబోలో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ భీమ్లానాయక్
, ఈ మూవీ చివరిదశ చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ దగ్గరినుండి ప్రతి ఒక్క అప్‌డేట్ సినిమాపై అంఛనాలు పెంచేస్తూ వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ రైట్స్ భారీ రేటుకి ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ కొనుగోలు చేయగా తాజాగా ఆడియో రైట్స్ విషయంలో కూడా ఈ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. తాజా సమాచారం ప్రకారం ఆదిత్య మ్యూజిక్ సంస్థ ఈ సినిమా ఆడియో రైట్స్‌ను రూ. 5.04 కోట్లకు కొనుగోలు చేసిందట. ఇప్పటికే అల్లు అర్జున్ పుష్ప, మహేష్‌బాబు సర్కారు వారి పాట ఆడియో రేట్లు చర్చనీయాంశంగా మారిన తరుణంలో తాజాగా భీమ్లా నాయక్ ఆడియో రైట్స్ అయిదు కోట్లను మించడంతో పవన్ స్టామినా మరియు థమన్ సందడి ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
భీమ్లా నాయక్ సినిమాలో పవన్ లుక్ మరియు పాత్ర రీమేక్‌తో పోలిస్తే చాలా డిపరెంట్‌గా ఉండబోతుందట. అలాగే టీజర్‌లో లుంగీ కట్టి.. పోలీస్ యూనిఫామ్ లో పవన్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.