జీవిత రాజ‌శేఖ‌ర్,హేమల‌తో త‌న ప్యానెల్‌ను ప్ర‌క‌టించిన ప్ర‌కాశ్ రాజ్

0
66

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈసారి ‘మా’అధ్యక్ష బరిలో నలుగురు పోటీ పడుతుండటంతో ఆ పగ్గాలు ఎవరు అందుకోబోతున్నారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే అభ్యర్థులు ఒకరిపై ఒకరు విమర్శులు చేసుకుంటూ వివాదాలకు తెరలేపారు. ఈ క్రమంలో అక్టోబర్‌ 10న ఎన్నికలు నిర్వహించనున్నట్లు క్రమ శిక్షణ కమిటీ తమ ప్రకటనలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు ప్రకాశ్‌ రాజ్ హైద‌రాబాద్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టి తమ ప్యానల్‌ సభ్యులను వెల్లడించారు. అదే విధంగా మా కోసం వారు ఏం చేయనున్నారో తెలిపారు ప్రకాశ్‌ రాజ్.

జయసుధ ఈసారి ప్యానెల్‌లో లేరని ఆమె అమెరికాలో ఉన్నారని ఆమె సపోర్ట్ తమకు వందశాతం ఉందన్నారు. తన తర్వాతి సమావేశంలో సభ్యులందరితో కలిసి వస్తానని…మా కోసం ఏం చేయనున్నామో వివరిస్తామని చెప్పారు. మా భవనం కోసం వస్తున్న మంచు విష్ణు ప్రయత్నం మంచిదేనని కానీ తనకు మా భవనంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలనే ఎజెండాతో ముందుకువస్తున్నానని స్పష్టం చేశారు.

మెయిన్ ప్యానల్ సభ్యులు:

 • అధ్యక్షుడు- ప్రకాశ్‌రాజ్‌
 • ట్రెజరర్‌-నాగినీడు
 • జాయింట్‌ సెక్రటరీ: అనితా చౌదరి, ఉత్తేజ్‌
 • ఉపాధ్యక్షుడు: బెనర్జీ, హేమ
 • ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌: శ్రీకాంత్‌
 • జనరల్‌ సెక్రటరీ: జీవితా రాజశేఖర్‌

ప్రకాశ్‌ రాజ్‌ ఎక్స్‌క్యూటివ్‌ మెంబెర్స్ జాబితా:

 • అనసూయ
 • అజయ్
 • భూపాల్
 • బ్రహ్మాజీ
 • ప్రభాకర్
 • గోవింద రావు
 • ఖయూమ్
 • కౌశిక్
 • ప్రగతి
 • రమణా రెడ్డి
 • శివా రెడ్డి
 • సమీర్
 • సుడిగాలి సుధీర్
 • సుబ్బరాజు. డి
 • సురేష్ కొండేటి
 • తనీష్
 • టార్జాన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here