Thursday, December 1, 2022
Homeఇండస్ట్రీ న్యూస్ఆ పాట చూసి నా సినిమాలో అలాంటి పాట ఒక్క‌టి లేదే అని అసూయ ప‌డ్డాను...

ఆ పాట చూసి నా సినిమాలో అలాంటి పాట ఒక్క‌టి లేదే అని అసూయ ప‌డ్డాను – దేవ్‌క‌ట్టా

ఆ పాట చూసి నా సినిమాలో అలాంటి పాట ఒక్క‌టి లేదే అని అసూయ ప‌డ్డాను – దేవ్‌క‌ట్టా

‘ఏమున్నవే పిల్ల.. ఏమున్నవే అందంతో బంధించావే..’ అనే ఒక్కపాటతో అటు ప్రేక్ష‌కులు ఇటు ఇండ‌స్ట్రీ దృష్టిని త‌న‌వైపు తిప్పుకున్న చిత్రం న‌ల్ల‌మ‌ల‌. ఈ మూవీ ద్వారా రవి చరణ్ దర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను రిప‌బ్లిక్ డైరెక్ట‌ర్ దేవ్‌క‌ట్టా రిలీజ్ చేశారు. నల్లమల అడవి బ్యాక్ డ్రాప్ లో వాస్తవ సంఘటనలు ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్ ఆకట్టుకొంది.

‘1980 జూలై 23, ఇరాన్‌-ఇరాక్‌ యుద్ధం మొదలయ్యే ముందు రోజులు ఇవి. అప్పుడప్పుడే నల్లమల అడవుల్లో అంతర్యుద్ధం మొదలైంది’ అనే మాటలతో ఈ మూవీ టీజర్‌ మొదలైంది. ప్రతి సన్నివేశంలో అమిత్‌ నటన ఆకట్టుకునేలా ఉంది. అధికారం కోసం నల్లమల అటవీ ప్రాంతంలో చోటుచేసుకునే సంఘటనలు.. అందమైన అడవిలో స్వచ్ఛమైన ప్రేమకథతో ఈ సినిమా రూపుదిద్దుకున్నట్లు టీజర్‌ను చూస్తే తెలుస్తోంది.

టీజర్‌ విడుదల సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న దేవాకట్టా మాట్లాడుతూ – ఈ మూవీలోని ఏమున్నావే పిల్ల‌ పాటను నేను నా ఫ్రెండ్స్‌తో హ్యాంగవుట్‌లో ఉంటే వింటాను. ఇలాంటి పాట నాకు ఒక్కటి కూడా లేదు అని అసూయ పడ్డాను. అమిత్‌ను మొదటిసారి చూసినప్పుడే ఇంత మంచి యాక్టర్‌వి ఎందుకు అంత తక్కువగా కనిపిస్తున్నావ్ అని అన్నాను. మంచి ఫుడ్ చాలా అరుదుగా దొరుకుతుందన్నట్టుగా అనిపించింది.ఇంత మంచి క్యాస్టింగ్‌ను పెట్టుకోవడంతోనే సినిమా సక్సెస్‌కు మొదటి మెట్టు పడ్డట్టు అయింది. ఈ చిత్రానికి పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్‌’అని అన్నారు.
ద‌ర్శ‌కుడు రవి చరణ్ మాట్లాడుతూ.. ‘నాతో ఈ సినిమా చేసినందుకు, నేను ఈ రోజు ఇక్కడ నిలబడి మాట్లాడేలా చేసిన నిర్మాత ఆర్ఎమ్ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నాకు దేవా కట్టా గారంటే చాలా ఇష్టం. టీజర్ రిలీజ్ చేసినందుకు థ్యాంక్స్. సినిమా గురించి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఓ రెండు విషయాలు చెబుతాను. అడవిని అడవి తల్లి.. గోవును గోమాత అని అంటాం. బానిస బతుకుల నుంచి భారతదేశం స్వేచ్చా ఆయువును పీల్చుకుంటున్న సమయంలో నల్లమల అడవుల్లోకి మానవ రూపంలో ఉన్న క్రూరమృగం ఎంట్రీ అయింది. ఆ మృగం ఎంట్రీ అయ్యాక ఏం జరిగింది అనేదే ఈ కథ. తరువాత సినిమా గురించి చాలా విషయాలు చెబుతాను. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్’ అని అన్నారు.

అమిత్ మాట్లాడుతూ.. ‘మొదటిసారి ఈ కథ విన్నప్పుడే ఇందులో నా పాత్ర ఏంటి అని అడిగాను. హీరో మీరే అని అన్నారు. ఆ మాటతో నేను షాక్ అయ్యాను. నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తున్నారు అంటే నమ్మలేకపోయాను. కానీ ఈ సినిమాకు నేను హీరో కాదు… కథే ఈ చిత్రానికి హీరో. ఇప్పటికే పీఆర్ అందించిన పాట ఎన్నో మిలియన్ల వ్యూస్ క్రాస్ చేసేసింది. భాను గారితో పని చేయడం చాలా ఆనందంగా ఉంది. నల్లమల అద్భుతమైన స్టోరీ. మీ అందరికీ నచ్చుతుంది“ అన్నారు.

హీరోయిన్ భాను శ్రీ‌ మాట్లాడుతూ.. ‘టీజర్ అద్భుతంగా ఉంది. దర్శకుడు రవి చరణ్‌కు నేను మొదటగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నాకు పల్లెటూరి పిల్లలా ఉండటం చాలా ఇష్టం. ఇలాంటి పాత్ర నాకు వస్తుందని ఊహించలేదు. నాకు ఈ కారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్స్. ఇది నాకు పెద్ద అవకాశం. నల్లమల సినిమాలో సిద్ శ్రీరామ్ పాడిన పాట చాలా పెద్ద హిట్ అయింది. ఎక్కడికి వెళ్లినా ఆ పాటతోనే నన్ను గుర్తిస్తున్నారు. మా టీజర్‌ను విడుదల చేసినందుకు దేవా కట్టా గారికి థ్యాంక్స్. అమిత్ గారితో పని చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన నాకు మంచి స్నేహితుడు. కెమెరామెన్ నన్ను చాలా ఆనందంగా చూపించారు. మేకప్ వేసుకున్నా కూడా వద్దు అంటూ సహజంగా అందంగా చూపించారు. పాటల వల్లే నల్లమల అనే చిత్రం ఉందని తెలిసింది. అంత మంచి పాట ఇచ్చినందుకు మ్యూజిక్ డైరెక్టర్‌కు థ్యాంక్స్. నేను బాగా నటించాను అని ఎప్పుడూ డైరెక్టర్ గారు చెబుతుంటారు. ఇంత వరకు నేను సినిమాను చూడలేదు. థియేటర్లో చూడాలని అనుకున్నాను’`అన్నారు.

నాజర్, తనికెళ్ళ భరణి, అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్, షవర్ అలీ, ఛత్రపతి శేఖర్, కాశీ విశ్వనాథ్, చలాకి చంటి, ముక్కు అవినాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!