విక్రాంత్ రోణ‌లో గ‌దంగ్ రాక్క‌మ్మగా జాక్వలైన్ ఫెర్నాండెజ్‌

August 1, 2021

విక్రాంత్ రోణ‌లో గ‌దంగ్ రాక్క‌మ్మగా జాక్వలైన్ ఫెర్నాండెజ్‌

శాండిల్‌వుడ్ బాద్‌షా కిచ్చా సుదీప్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘విక్రాంత్ రోణ‌’. 3డీలో సినిమా రూపొందుతోంది. రీసెంట్‌గా బాలీవుడ్ స్టార్ జాక్వలైన్ ఫెర్నాండెజ్ ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంద‌ని నిర్మాత‌లు అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. కాగా శ‌నివారం గ‌దంగ్ రాక్క‌మ్మగా జాక్వ‌లైన్ ఫ‌స్ట్ లుక్‌తో పాటు ఆమె పాత్ర‌కు సంబంధించిన గింప్స్‌ను కూడా చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

బాహు భాషా యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ మూవీగా రూపొందుతోన్న ‘విక్రాంత్ రోణ‌’ త్రీడీలో 14 భాష‌లు, 55 దేశాల్లో విడుద‌ల‌వుతుంది. అనూప్ భండారి ద‌ర్శ‌క‌త్వంలో జాక్ మంజునాథ్ షాలిని మంజునాథ్‌(షాలిని ఆర్ట్స్‌) నిర్మిస్తున్నారు. బి.అజ‌నీశ్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కె.జి.య‌ఫ్ ఫేమ్ శివ‌కుమార్ భారీ సెట్స్ వేశారు. అలాగే విలియ‌మ్ డేవిడ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. కిచ్చా సుదీప్‌, నిరూప్ భండారి, నీతా అశోక్‌, జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు.