హైద‌రాబాద్‌లో `ఎఫ్‌3` షూటింగ్ తిరిగి ప్రారంభం.

September 17, 2021

హైద‌రాబాద్‌లో `ఎఫ్‌3` షూటింగ్ తిరిగి ప్రారంభం.

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో వచ్చిన ఎఫ్ 2 చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్‌గా మూడు రెట్లు ఎక్కువ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో ఎఫ్ 3 చిత్రాన్ని రూపొందిస్తున్నారు ద‌ర్శ‌కుడు అనిల్‌రావిపూడి. కోవిడ్ వ‌ల్ల ఆల‌స్య‌మైన ఈ మూవీ షూటింగ్‌ను శ‌ర‌ వేగంగా పూర్తి చేసేందుకు చిత్రయూనిట్ ప్రణాళిక వేసింది.

ఎఫ్ 2 సినిమాతో నవ్వుల వర్షం కురిపించిన అనిల్ రావిపూడి..ఈ సంక్రాంతికి ఎఫ్‌3తో మరోసారి ప్రేక్ష‌కుల‌ను న‌వ్వుల్లో మంచెత్త‌నున్నారు. దానికోసం ఎఫ్ 3లో వెంకటేష్, వరుణ్ తేజ్‌లకు ప్రత్యేకమైన మ్యానరిజంలు, బాడీ లాంగ్వేజ్‌లను క్రియేట్ చేశారు. తమన్నా, మెహ్రీన్‌లు వెంకటేష్, వరుణ్ తేజ్ స‌ర‌స‌న హీరోయిన్లుగా నటిస్తున్నారు. సునీల్ ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోన్నారు.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ హైద్రాబాద్‌లో శుక్రవారం ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో చిత్ర తారాగణం అంతా పాల్గొననున్నారు. మేకింగ్ వీడియోలో నటీనటులు, టెక్నీషియన్స్ అందరి మొహాలపై చిరునవ్వుతో సెట్ అంతా కూడా సందడి వాతావరణం కనిపిస్తోంది. ఎఫ్ 3 కోసం స్పెషల్ ట్యూన్లను దేవీ శ్రీ ప్రసాద్ సిద్దం చేశారు. సాయి శ్రీరామ్ కెమెరామెన్‌గా, తమ్మిరాజు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. హర్షిత్ రెడ్డి సహ నిర్మాతగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.