స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన దిగంగ‌న సూర్య‌వంశీ..

October 9, 2021

స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన దిగంగ‌న సూర్య‌వంశీ..

దిగంగ‌న సూర్య‌వంశీ.. ‘హిప్పీ’ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ‌. మొద‌టి సినిమాతోనే హీరో కార్తికేయ‌తో రొమాన్స్‌లో రెచ్చిపోయి కుర్ర‌కారుకి మ‌రింత ద‌గ్గ‌రైంది. ఈ అమ్మ‌డు ఇప్పుడిప్పుడే తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకుంటుంది. ప్ర‌స్తుతం దిగంగన స్క్రిప్ట్ సెల‌క్ష‌న్‌లో ఆచితూచి అడుగులు వేస్తుంది.

ఇటీవ‌ల గోపీచంద్ స‌ర‌స‌న సీటీమార్‌లో హీరోయిన్‌గా న‌టించింది. ఈ సినిమా మంచి విజ‌యం సాధించ‌డం, త‌న పాత్ర‌కి మంచి గుర్తింపు రావ‌డంతో ఫుల్‌జోష్‌లో ఉంది.

ప్ర‌స్తుతం ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్‌లో యంగ్ హీరో సందీప్ కిష‌న్ స‌ర‌స‌న హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇదే కాకుండా త్వ‌ర‌లో ఓ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింద‌ట ఈ బ్యూటీ..ఆ సినిమాతో త‌న కెరీర్ సాఫీగా సాగుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేస్తోంది. త్వ‌ర‌లోనే ఆ వివ‌రాలు తెలుస్తాయి. ఈ అమ్మ‌డు కూడా సెల‌క్టివ్‌గా ప్రాజెక్టులు ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతుంది. దాంతో పాటు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కేక పెట్టింస్తుంది.