కావాల‌నే నాపై ఎటాక్ చెయ్యొద్దు – విష్వ‌క్ సేన్

August 13, 2021

కావాల‌నే నాపై ఎటాక్ చెయ్యొద్దు – విష్వ‌క్ సేన్

ఈ న‌గ‌రానికి ఏమైంది, ఫ‌ల‌క్‌నుమాదాస్‌,హిట్ వంటి చిత్రాల‌తో గుర్తింపు తెచ్చుకున్నవిష్వ‌క్‌సేన్ న‌టించిన చిత్రం పాగ‌ల్‌. సినిమా ఆగ‌స్ట్ 14న విడుద‌ల‌వుతుంది. ఈ సందర్భంగా హీరో విష్వక్ సేన్ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌లుఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు పంచుకున్నారు.

ఐదు, ప‌ది నిమిషాల్లోనే సినిమా ఎలా ఉంటుందో ప్రేక్ష‌కులకు ఓ క్లారిటీ వ‌చ్చేస్తుంది. త‌న త‌ల్లి చ‌నిపోబోతున్న‌ప్పుడు నీ అంత బాగా న‌న్నెవ‌రు చూసుకుంటారమ్మా అని హీరో అడిగితే నువ్వు నిజాయ‌తీగా ప్రేమిస్తే వాళ్లు కూడా అంతే నిజాయితీగా తిరిగి ప్రేమిస్తారు అని చెబుతుంది. అందుక‌ని అన్ కండీష‌న‌ల్‌గా ప్రేమిస్తుంటే మా అమ్మ ప్రేమ తిరిగి దొరుకుతుంది అనే పాయింట్ మీద‌నే సినిమా అంతా ర‌న్ అవుతుంది అని చెప్పుకొచ్చాడు. ఆడియో ఫంక్ష‌న్‌లో నేను మాట్లాడిన ఏ మాట‌ను వెన‌క్కి తీసుకోవ‌డం లేదు. కొన్ని గంట‌లు మాత్ర‌మే మిగిలున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వ‌చ్చే ముందు నా సినిమాను నేను ఓసారి చూసుకుంటాను. దాన్ని బేస్ చేసుకునే స్టేజ్‌పై మాట్లాడుతాను. మాది పెద్ద సినిమా కాదు గొప్ప సినిమా అని అన్నారు. ఆ త‌ర్వాత స‌మీక్ష‌కుల గురించి మాట్లాడుతూ నేను ఎలాంటి గాడ్‌ఫాద‌ర్ లేకుండా ఇండ‌స్ట్రీకి వ‌చ్చాను. ఎంతో క‌ష్ట‌ప‌డి అవకాశాలు తెచ్చుకున్నాను. ఈ సినిమా చూసే విమ‌ర్శ‌కులు కూడా స‌పోర్ట్ చేయాల‌ని కోరుకుంటున్నాను. నాపై కావాల‌నే ఎటాక్ చేయ్యొద్దు అని విన్న‌వించుకున్నారు.