మ‌రో రిమేక్‌లో న‌టించ‌నున్న‌ వెంకీమామ‌…!ఈ సారి స్టార్ డైరెక్ట‌ర్‌తో….

December 7, 2021

మ‌రో రిమేక్‌లో న‌టించ‌నున్న‌ వెంకీమామ‌…!ఈ సారి స్టార్ డైరెక్ట‌ర్‌తో….

విక్ట‌రి వెంక‌టేష్ ఇప్ప‌టివ‌ర‌కు 25కు పైగా రీమేక్‌ చిత్రాల్లో నటించి విజయాలు సొంతం చేసుకున్నాడు. అలాగే మ‌హేష్ బాబు, వ‌రుణ్ తేజ్‌, నాగ చైత‌న్య వంటి యంగ్ హీరోస్‌తో క‌లిసి న‌టించాడు. ఇతర సీనియర్‌ హీరోలకు భిన్నంగా ముందుకు సాగుతున్న వెంక‌టేష్‌.. తాజాగా మరో రీమేక్‌ చిత్రంలో నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మలయాళంలో విజయవంతమైన ‘డ్రైవింగ్ లైసెన్స్‌’ చిత్రానికి తెలుగు రీమేక్‌లో ఆయన నటించనున్నట్లు తెలుస్తోంది.

Read more: ఆనంద్ దేవ‌ర‌కొండ‌ `హైవే` కాన్సెప్ట్ పోస్ట‌ర్స్‌ చూశారా..?

2019లో విడుదలైన ‘డ్రైవింగ్ లైసెన్స్‌’ మంచి విజయం సాధించింది. ఓ స్టార్‌ హీరో, అతని అభిమాని అయిన ఆర్టీఓ అధికారి మధ్య ఊహించని విధంగా ఏర్పడిన ఇగో క్లాష్ వారి జీవితాలను ఎలా మలుపుతిప్పిందన్న పాయింట్‌తో దర్శకుడు లాల్ తనయుడు జీన్ పాల్ లాల్ ఈ కామెడీ యాక్షన్‌ డ్రామాను తెరకెక్కించారు. మలయాళంలో స్టార్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్‌ నటించగా, అతని అభిమాని, ఆర్టీఓ ఆఫీసర్ పాత్రను సూరజ్ వెంజరమూడు పోషించాడు.

Read more: http://అఖండ టీమ్‌కు లావీష్ పార్టీ ఇచ్చిన దిల్‌రాజు..బాల‌కృష్ణ‌తో సినిమా ఎప్పుడంటే..?

ఈ సినిమా క‌థ న‌చ్చ‌డంతో వెంట‌నే రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నాడు రామ్ చ‌రణ్. అయితే ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉండ‌డం వ‌ల్ల ఆల‌స్య‌మ‌వుతుంద‌ని ఈ హ‌క్కుల్ని గీతా ఆర్ట్స్ కు ఇచ్చాడట రామ్ చ‌ర‌ణ్‌. స్టార్ హీరోగా వెంక‌టేష్ క‌రెక్ట్ అని భావిస్తోంద‌ట గీతా ఆర్ట్స్‌. అలాగే అత‌ని అభిమానిగా రీసెంట్‌గా హిట్ కొట్టిన ఒక యంగ్ హీరోని తీసుకోనుంద‌ట‌. కాక‌పొతే వెంక‌టేష్ ఇప్పుడు ఎఫ్ 3, నెట్‌ఫ్లిక్స్ కోసం చేస్తున్న రానా నాయుడు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ఆ సినిమాల త‌ర్వాత ఒక స్టార్ డైరెక్ట‌ర్‌తో ఈ సినిమా ఉండ‌నుండ‌ట‌.

ట్రెండింగ్ వార్తలు