Tollywood: ఈ వారం థియేట‌ర్‌,ఓటీటీలో రిలీజ‌య్యే సినిమాలు

September 13, 2022

Tollywood: ఈ వారం థియేట‌ర్‌,ఓటీటీలో రిలీజ‌య్యే సినిమాలు

సినీప్రియులకు ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండనుంది. థియేటర్లలో.. ఓటీటీలలో మరిన్ని సినిమాలు రాబోతున్నాయి. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద బ్రహ్మాస్త్ర హావా కొనసాగుతుండగా.. ఇక ఇప్పుడు సెప్టెంబర్ రెండవ వారంలో చిన్న సినిమాల జోరు కొనసాగనుంది. తెలుగుతోపాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ అనేక సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. అవెంటో చూద్దాం.

nenumeekubaagakaavalsinavaadini

కిరణ్ అబ్బవరం హీరోగా సంజనా ఆనంద్, సోనూ ఠాకూర్ హీరోయిన్లుగా తెర‌కెక్కిన చిత్రం నేను మీకు బాగా కావాల్సిన వాడిని. శ్రీధర్ గాదె రూపొందిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆసక్తిగా ఉండగా.. సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ సెప్టెంబర్ 16న విడుదల కానుంది.

Aa Ammayi Gurinchi meeku cheppali

సుధీర్ బాబు-కృతి శెట్టి జంటగా నటిస్తోన్న చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కిస్తోన్న ఈ మూవీ సెప్టెంబర్ 16న విడుదల కానుంది. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.

Saakini-Daakini

కొరియన్ సూపర్ హిట్ మిడ్ నైట్ రన్నర్స్ చిత్రానికి రీమేక్‏గా వస్తోన్న సినిమా శాకిని ఢాకిని. నివేదా థామస్..రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. డైరెక్టర్ సుధీర్ వర్మ రూపొందిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 16న రిలీజ్ కాబోతుంది.

sakala-gunabhi-rama

బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ వీజే సన్నీ హీరోగా నటిస్తోన్న సినిమా సకల..గుణాభిరామ. ఇందులో అషిమా నర్వాల్ కథానాయికగా నటిస్తోంది. వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 16న విడుదల కానుంది.

k3-kotikokkadu

అలాగే నేను కేరాఫ్ నువ్వు.. కే3 సినిమాలు సెప్టెంబర్ 16న.. ముత్తు మూవీ సెప్టెంబర్ 15న విడుదల కానున్నాయి.

ట్రెండింగ్ వార్తలు