సూర్య డబుల్‌ యాక్షన్‌?

August 24, 2022

సూర్య డబుల్‌ యాక్షన్‌?

‘24’, ‘బ్రదర్స్‌’, ‘రాక్షసుడు’, ‘రాజుభాయ్‌’ వంటి సినిమాల్లో సూర్య డబుల్‌ యాక్షన్‌ యాక్టింగ్‌ను చూశాం. మరోసారి సూర్య డబుల్‌ రోల్‌ చేయనున్నారనే టాక్‌ కోలీవుడ్‌లో వినిపిస్తుంది. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కకుతున్న కొత్త సినిమా షూటింగ్‌ ఆగస్టు 24నుంచి ప్రారంభమైంది. ఈ సినిమా 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందట. అంతేకాదు..ఈ సినిమాలో సూర్య డబుల్‌ యాక్షన్‌ చేయనున్నారట. ఇక ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ దిశాపటానీ హీరోయిన్‌గా నటిస్తారనే వార్తలు వచ్చినప్పటికీని వాటిల్లో నిజం లేదని తెలుస్తోంది. మరి ఎవరు హీరోయిన్‌గా నటిస్తారు? అనే విషయంపై త్వరలో ఓ క్లారిటీ రానుంది. ఇక ప్రస్తుతం సూర్య ‘వాడివాసల్‌’, ‘అచలుడు’ అనే సినిమాలు చేస్తున్నారు.వాడివాసల్‌కు వెట్రిమారన్, అచలుడు సినిమాకు బాల దర్శకులు.

ట్రెండింగ్ వార్తలు