24వ రోజు కూడా డీసెంట్ కలెక్ష‌న్స్ సాధించిన సీతారామం

August 29, 2022

24వ రోజు కూడా డీసెంట్ కలెక్ష‌న్స్ సాధించిన సీతారామం

చ‌క్క‌టి ప్రేమ కావ్యంగా ఇటీవ‌ల‌ విడుద‌లైన ‘సీతారామం’ ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను దోచుకోవ‌ట‌మే కాదు.. సినీ విమ‌ర్శ‌కుల ప్ర‌శ‌సంల‌ను కూడా అందుకుంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ‘సీతారామం’ సినిమా చూశారు. ఆయ‌న‌కు న‌చ్చేసింది. వెంట‌నే సినిమా గురించి ట్వీట్ చేశారు. ‘‘సీతారామం’ చూశాను. ఒక చ‌క్క‌టి ప్రేమ కావ్యం చూసిన అనుభూతి. ముఖ్యంగా ఎంతో విభిన్న‌మైన స్క్రీన్ ప్లేతో ఈ ప్రేమ క‌థ‌ని ఆవిష్క‌రించిన విధానం ఎంత‌గానో న‌చ్చింది. మ‌న‌సుల‌పై చెర‌గ‌ని ముద్ర వేసే ఇలాంటి చిత్రాన్ని ఎంతో ఉన్న‌త‌మైన విలువ‌ల‌తో నిర్మించిన అశ్వినీద‌త్‌గారికి, స్వ‌ప్నా ద‌త్‌, ప్రియాంకా ద‌త్‌ల‌కు, ఓ ప్యాష‌న్‌తో చిత్రీక‌రించిన దర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడికి. క‌ల‌కాలం నిలిచే సంగీతాన్ని అందించిన విశాల్ చంద్ర శేఖ‌ర్‌కి, అన్నింటిక‌న్నా ముఖ్యంగా సీత, రామ్‌లుగా ఆ ప్రేమ‌క‌థ‌కి ప్రాణం పోసిన మృణాల్ ఠాకూర్‌ , దుల్క‌ర్ స‌ల్మాన్‌ల‌కు, సూత్ర‌ధారి పాత్ర పోషించిన ర‌ష్మిక మంద‌న్నకి మొత్తం టీంకి అంద‌రికీ నా శుభాకాంక్ష‌లు. ప్రేక్ష‌కుల మ‌న‌సులు దోచిన ఈ చిత్రం మ‌రెన్నో అవార్డుల‌ను, రివార్డుల‌ను జాతీయ స్థాయిలో గెల‌వాల‌ని మ‌న‌స్ఫూర్తిగా అభిల‌షిస్తున్నాను’’ అని సినిమాపై త‌న అభిప్రాయాన్ని తెలియ‌జేశారు.

సీతారామం (Sita Ramam Collections) సినిమా విష‌యానికి వ‌స్తే.. ఆగస్టు 5న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవడంతో… మంచి కలెక్షన్లు నమోదు చేసింది. కానీ ఆశించిన స్థాయిలో కాదు. మొదటి రోజు కలెక్షన్లు బట్టి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా అనే అనుమానం కూడా చాలా మందిలో కలిగింది. అయితే రెండో రోజు నుండి ఈ మూవీ బాగా పికప్ అయ్యింది. 4వ వారంలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈ చిత్రం జోష్ తగ్గలేదు. నిన్న 24 వ రోజు కూడా ఈ మూవీ సూపర్ గా కలెక్ట్ చేసింది.

ఒకసారి 24 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం : 9 కోట్లు సీడెడ్ : 1.81 కోట్లు ఉత్తరాంధ్ర : 3.34 కోట్లు ఈస్ట్ : 1.84 కోట్లు వెస్ట్ : 1.19 కోట్లు గుంటూరు : 1.55 కోట్లు కృష్ణా : 1.66 కోట్లు నెల్లూరు : 0.81 కోట్లు

ఏపీ+తెలంగాణ టోటల్ : 21.2 కోట్లు(షేర్)

రెస్ట్ ఆఫ్ ఇండియా : 2.58 కోట్లు ఓవర్సీస్ : 6.85 కోట్లు మిగిలిన వెర్షన్లు : 7.62 కోట్లు

వరల్డ్ వైడ్ టోటల్ : 38.25 కోట్లు(షేర్)

మొత్తానికి ఈ సినిమా 25 రోజుల్లో 75 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్లు వ‌సూలు చేయ‌నుంది.

ట్రెండింగ్ వార్తలు