వారి ఫ్యాన్స్‌కు నిద్ర‌లేకుండా చేస్తున్న శంక‌ర్‌

August 25, 2022

వారి ఫ్యాన్స్‌కు నిద్ర‌లేకుండా చేస్తున్న శంక‌ర్‌

ఆగిపోయిన కమల్‌హాసన్‌ ‘ఇండియన్‌ 2’ సినిమాను దర్శకుడు శంకర్‌ స్టార్ట్‌ చేయగానే రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌ కంగారు పడ్డారు. రామ్‌చరణ్‌తో శంకర్‌ చేస్తున్న సినిమాను పక్కన పెట్టేశాడని చరణ్‌ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో గగ్గోలు పెట్టారు. దీంతో శంకర్‌ ఈ విషయంపై ఓ క్లారిటీ ఇచ్చాడు. ‘‘ఇండియన్‌ 2, ఆర్‌సీ 15..ఈ రెండు సినిమాలను ఒకే టైమ్‌లో చేస్తాను. రామ్‌చరణ్‌తో నేను చేస్తున్న సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ సెప్టెంబరులో హైదరాబాద్, వైజాగ్‌ లోకేషన్స్‌లో స్టార్ట్‌ అవుతుంది’’ అని ట్వీట్‌ చేశారు. దీంతో రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌ కాస్త చల్లబడ్డారు. ఏ మాటకు ఆ మాటే కానీ శంకర్‌ ఇన్నేళ్ల కెరీర్‌లో ఒకేసారి రెండు సినిమాలు దర్శకత్వం వహించింది లేదు. ఫస్ట్‌టైమ్‌ శంకర్‌ ఇలా చేస్తున్నారు. మరోవైపు ఈ రెండు సినిమాలతో పాటుగా శంకర్‌ హిందీలో రణ్‌వీర్‌సింగ్‌తో ఓ సినిమా అంగీకరించిన సంగతి తెలిసిందే. ఇది హిట్‌ మూవీ ‘అపరిచితుడు’కు హిందీ రీమేక్ అది. ఆల్‌రెడీ ప్లాఫులో ఉన్న డైరెక్ట‌ర్ ఈ మూడు సినిమాల‌పై ఒకేసారి దృష్టి పెట్ట‌డం వారి వారి ఫ్యాన్స్ కు నిద్ర‌ప‌ట్ట‌కుండా చేస్తుంది.

TRENDING NOW