SitaRamamOTT: ఓటీటీకి సిద్ద‌మైన సీతారామం..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

September 6, 2022

SitaRamamOTT: ఓటీటీకి సిద్ద‌మైన సీతారామం..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

టాలీవుడ్ లో ప్రేక్షకుల మనసులను హత్తుకునే ప్రేమకథలు వచ్చి చాలా కాలమైంది. ఇటీవల థియేటర్లలో విడుదలై అందరినీ ఆకట్టుకొని ఆ లోటు పూడ్చేసిన సినిమా ‘సీతారామం’. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ ప్రేమకావ్యంలో.. మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఇక ఈ యుద్ధంతో రాసిన ప్రేమకథను వైజయంతి బ్యానర్ లో స్వప్న దత్ నిర్మించారు. ఇక ఆగష్టు 5న గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే.

మొదటి రోజునుండే పాజిటివ్ టాక్ తో కలెక్షన్స్ పరంగానూ థియేటర్లలో దుమ్మురేపింది. ఇక విడుదలై నెల రోజులు దాటినా ఇంకా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది. అందమైన ప్రేమకథగా ఎమోషనల్ అంశాలు జోడించి తెరకెక్కించిన ఈ సినిమా.. చాలాకాలం తర్వాత చూసినవారందరి కళ్ళు చెమ్మగిల్లేలా చేసి విజయం సాధించింది. ఇప్పటికే వసూళ్ల పరంగా డబుల్ ప్రాఫిట్స్ రాబట్టిన సీతారామం.. ఇటీవల హిందీలో కూడా థియేట్రికల్ రిలీజ్ అయ్యింది. ఒరిజినల్ గా తెలుగే అయినప్పటికీ, తమిళ, మలయాళం భాషలలో కూడా రిలీజ్ చేశారు మేకర్స్.

ఇదిలా ఉండగా.. ఎంత గొప్ప సినిమా అయినా ఈ మధ్యకాలంలో థియేట్రికల్ రిలీజ్ తర్వాత చాలా త్వరగా డిజిటల్ స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్నాయి. ఓవైపు థియేటర్లలో రన్ అవుతుండగానే సీతారామం మూవీ ఓటిటిలోకి ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పనుంది అమెజాన్ ప్రైమ్ టీమ్. సీతారామం ఓటిటి హక్కులను సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ వారు ఈ సినిమాను సెప్టెంబర్ 9 నుండి స్ట్రీమింగ్ చేయనున్నారని అధికారికంగా ప్ర‌క‌టించారు. మ‌రి మీకు ఇష్ట‌మైన సీతారామం సినిమాను మీ ఇంట్లోనే చూసి ఎంజాయ్ చేయండి.

ట్రెండింగ్ వార్తలు