నువ్వు ఒక సెకెండ్ హ్యాండ్ ఐటెం..నెటిజ‌న్ కామెంట్‌కు స‌మంత షాకింగ్ రిప్లై…

December 23, 2021

నువ్వు ఒక సెకెండ్ హ్యాండ్ ఐటెం..నెటిజ‌న్ కామెంట్‌కు స‌మంత షాకింగ్ రిప్లై…

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుసగా తెలుగు, త‌మిళ్‌, హిందీ, ఇంగ్లీష్ సినిమాలతో దూసుకెళ్లిపోతోంది. నాగ చైతన్యతో డైవ‌ర్స్ త‌ర్వాత స‌మంత కెరీర్​ సరికొత్త పంథాలో వెళ్తోంది. కెరీర్ విష‌యం ఎలా ఉన్నా ఇప్ప‌టికీ నెటిజన్లు, అక్కినేని అభిమానుల నుంచి సామ్​ను టార్గెట్ చేస్తూ పలు రకాల ట్రోల్స్ వస్తున్నాయి. కొంత మంది సమంతదే తప్పంటే..మ‌రికొంత మంది సామ్​కు సపోర్ట్​గానూ మాట్లాడుతూ కామెంట్లు పెడుతున్నారు.

తాజాగా, ఓ నెటిజన్ సమంతను ట్యాగ్ చేస్తూ.. నువ్వు ఒక సెకెండ్ హ్యాండ్ ఐటెం.. ఒక మంచి వ్యక్తి దగ్గర విడాకుల పేరుతో 50కోట్లను దోచుకున్నావ్​. అంటూ కామెంట్ చేశాడు. ఈ కామెంట్‌పై సమంత చాలా పాజిటీవ్‌గా స్పందించి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. తిరిగి అత‌న్ని ట్యాగ్ చేస్తూ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నా..అంటూ బ‌దులిచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్​ నెట్టింట వైరల్​గా మారింది. స‌మంత ఇంత మెచ్యూర్డ్‌గా ఆలోచించ‌డంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు