ఆ విషయంలో రాజమౌళి హిట్‌…పూరీ, కొరటాల ఫ్లాప్‌!

August 29, 2022

ఆ విషయంలో రాజమౌళి హిట్‌…పూరీ, కొరటాల ఫ్లాప్‌!

చిరంజీవి హీరోగా, రామ్‌చరణ్‌ కీలక పాత్రలో కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమాను రామ్‌చరణ్‌ కొణిదెల ప్రొడక్షన్స్, నిరంజన్‌ రెడ్డి మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు నిర్మించాయి. ఏప్రిల్‌ 29న ఈ సినిమా థియేటర్స్‌లో రిలీజ్‌ అయ్యింది. అయితే ఈ సినిమా బిజినెస్, థియేట్రికల్‌ డిస్ట్రిబ్యూషన్‌ విషయంలో ఈ చిత్రం దర్శకుడు కొరటాల శివ బాగా ఇన్‌వాల్వ్‌ అయ్యారు. కానీ రిలీజ్‌ తర్వాత ‘ఆచార్య’ చిరంజీవి కెరీర్‌లోనే వన్నాఫ్‌ ది బిగ్గెస్ట్‌ డిజాస్టర్స్‌ మావీగా నిలిచింది. దీంతో ‘ఆచార్య’ సినిమా నష్టాలను భరించాల్సివచ్చింది కొరటాల శివ. ఒకనొక దశలో ‘ఆచార్య’ ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్‌ కొరటాల శివ ఆఫీస్‌ను చుట్టు ముట్టారనే వార్తలు వచ్చాయి. ఈ నష్టాలను కవర్‌ చేయడం కోసం హైదరాబాద్‌లోని కొన్ని ఆస్తులను కూడా కొరటాల శివ అమ్ముకోవాల్సి వచ్చిందంట. ‘ఆచార్య’ లావాదేవీలు ఇంకా క్లారిఫ్లై కాకపోవడం వల్లే కొరటాల శివ నెక్ట్స్‌ మూవీపై ఇంకా ఫోకస్‌ పెట్టలేకపోతున్నారు.

ఇప్పుడు సేమ్‌ పరిస్థితి పూరీ జగన్నాథ్‌ది. విజయ్‌దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో ‘లైగర్‌’ సినిమా వచ్చింది. ఆగస్టు 25, 2022న విడుదలైన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. పూరీ జగన్నాథ్, చార్మీ, అపూర్వ మెహతా, కరణ్‌జోహార్‌ నిర్మించారు. అయితే ఈ సినిమాను అడ్వాన్స్‌ బేస్డ్‌ ఫార్మాట్‌లో అమ్మడం వల్ల రిలీజ్‌కు ముందే పూరీ కాస్త డబ్బులు పోగేసుకున్నారు. కానీ రిలీజ్‌ తర్వాత ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్‌కు భారీగా నష్టాలు వచ్చాయి. ముఖ్యంగా నైజాంలో వరంగల్‌ శీను ‘లైగర్‌’ సినిమాను 60కోట్లకు తీసుకున్నారు. ఇందులో పావులో పావువంతు కూడా రికవరీ వచ్చే పరిస్థితి లేదు. వైజాగ్‌ రిజీయన్‌లో డిస్ట్రిబ్యూట్‌ చేసిన ‘దిల్‌’ రాజుకు దాదాపు ఐదు కోట్ల నష్టం వచ్చిందట. అలాగే ఫైనాన్షియర్‌ చదలవాడ శ్రీనివాస్‌కు. ఇలా అందరు రీసెంట్‌గా పూరీని కలిసి పరిస్థితి వివరించారు. దీంతో పూరీ కొంత మొత్తాన్ని వెనక్కి తిరిగి ఇవ్వడానికి అంగీకరించారట. మరికొంత అమౌంట్‌పై మాత్రం పూరీ మౌనం వహిస్తున్నారట.

అయితే దర్శకులు ఎప్పుడైతే కథపై కాకుండా బిజినెస్‌లోకి వచ్చీ ఆలోచించడం స్టార్ట్‌ చేశారో అప్పుడే సినిమాలు డిజాస్టర్స్‌గా నిలిస్తున్నాయి. సో..ఇకనైనా ఎవరి పని వారు చేసుకుంటే అందరికీ, ఇండస్ట్రీకి మంచి దెమోనని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ విషయంలో ఒక్క రాజమౌళి మాత్రమే సక్సెస్‌ అయ్యారు. ‘బాహుబలి, ‘బాహుబలి 2’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రిలీజ్‌ల విషయంలో రాజమౌళి జాగ్రత్తగా వ్యవహరించి లాభ పడ్డారు. కానీ ప్రతిదీ అందరికీ కలిసి రావాలని ఏం లేదుగా మరి.

ట్రెండింగ్ వార్తలు