Radheshyam: రివ్యూ అండ్ రేటింగ్‌ ఆ మైనస్ లు లేకుంటేనా..

March 11, 2022

Radheshyam: రివ్యూ అండ్ రేటింగ్‌ ఆ మైనస్ లు లేకుంటేనా..

విడుదల తేదీ :మార్చి 11, 2022 తారాగణం : ప్రభాస్, పూజా హెగ్డే, కృష్ణంరాజు, మురళీ శర్మ, భాగ్యశ్రీ, జగపతి బాబు తదితరులు దర్శకుడు : రాధా కృష్ణకుమార్ సంగీతం :  జస్టిన్ ప్రభాకరన్, తమన్(బ్యాక్ గ్రౌండ్ స్కోర్)  సినిమాటోగ్రఫీ :  మనోజ్ పరమహంస  నిర్మాతలు :  వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మాణ సంస్థ : ‘గోపికృష్ణా మూవీస్’ ‘యూవీ క్రియేషన్స్’

‘బాహుబలి2’ కంప్లీట్ అయ్యాక ప్రభాస్ ఒప్పుకున్న భారీ బడ్జెట్ సినిమాల్లో ‘రాధే శ్యామ్’ ఒకటి. ‘జిల్’ వంటి యవరేజ్ సినిమాని అందించిన రాధా కృష్ణకుమార్ కు ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని కట్టబెట్టాడు ప్రభాస్. ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తోన్న ఈ చిత్రం ఎట్టకేలకు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ‘రాధే శ్యామ్’ ప్రేక్షకుల్ని ఎంత వరకు మెప్పించిందో ఓ లుక్కేద్దాం రండి :

కథ: విక్రమాదిత్య(ప్రభాస్) అనే గ్రేట్ పామిస్ట్.కొన్ని కారణాల వల్ల ఇండియాని వదిలేసి విదేశాల్లో బ్రతుకుతుంటాడు. గొప్ప గొప్ప వాళ్ళు ఇతన్ని కలవడానికి అప్పాయింట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. ఇతను చెయ్యి చూసి భవిష్యత్తు చెబితే అది నూటికి నూరుపాళ్లు జరుగుద్ది అనేది వాళ్ళ నమ్మకం. మరోపక్క ఇతని తల్లి(భాగ్యశ్రీ) ఇతనికి పెళ్లి చేయాలని చూస్తుంటే అది తప్పించుకుని ఒక్కో అమ్మాయితో ఫ్లర్టేషన్ షిప్ అంటూ తిరుగుతూ ఉంటాడు. ఇలాంటి టైములో అనుకోకుండా ప్రేరణ(పూజా హెగ్డే) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి నూరేళ్ళు బ్రతుకుతుంది అంటూ ఇతను జాతకం చెబుతాడు. కానీ ప్రేరణకి వైద్యులు నయం చేయలేని రోగం ఒకటి ఉంటుంది. మరి విక్రమాదిత్య జాతకం నిజమా… అబద్దమా! చివరికి వీళ్ళ ప్రేమ కథ ఏమైంది అనేది తెరపై చూడాల్సిన కథ.

ప్లస్సులు :ప్రభాస్ స్క్రీన్ అప్పీరెన్స్, పెర్ఫార్మన్స్ బాగున్నాయి. పూజా హెగ్డే తో అతని కెమిస్ట్రీ బాగా కుదిరింది. పూజా హెగ్డే నటన, గ్లామర్ ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పుకోవాలి. జస్టిన్ అందించిన పాటలన్నీ చూడ్డానికి కూడా బాగున్నాయి. తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. కృష్ణంరాజు .. విక్రమాదిత్య గురువుగా కరెక్ట్ గా సరిపోయారు. ‘బిల్లా’ ‘రెబల్’ సినిమాల్లో కృష్ణంరాజు వేషధారణ అతిగా అనిపిస్తుంది. కానీ ఈ చిత్రంలో ఆయన వయసుకి తగ్గ పాత్ర కుదిరింది. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. విజువల్స్ అందరినీ ఆకర్షిస్తాయి. ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ పోర్షన్ కూడా బాగుంది.

మైనస్ లు:దర్శకుడు రాధా కృష్ణ కుమార్ అనుకున్న పాయింట్ బాగానే ఉంది. కానీ దానిని ప్రభాస్ ఇమేజ్ కు తగినట్టు తెరకెక్కించలేకపోయాడు. ప్రభాస్ కూడా తన ఇమేజ్ పెరిగింది కాబట్టి.. అన్ని జోనర్లను టచ్ చేయాలనుకోవడం తప్పులేదు. కానీ అతనికి ఫ్యాన్స్ అండ్ ఫ్యామిలీ ఆడియెన్స్ ప్రధానబలం.వాళ్ళను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేయాల్సిన అవసరం కూడా ఉంది. కొరటాల లాంటి దర్శకులతో స్టైలిష్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లు చేసినా కాసుల వర్షం కురుస్థాయి. కానీ విజయ్ దేవరకొండ చేయాల్సిన కథలు ప్రభాస్ చేయడం అభిమానులకి, ఫ్యామిలీ ఆడియెన్స్ కు కూడా పెద్ద ఇబ్బందే..!

అసలు విక్రమాదిత్య ఇండియాని వదిలేసి విదేశాల్లో ఎందుకు ఉంటున్నాడు అనే పాయింట్ కు దర్శకుడు జస్టిఫికేషన్ ఇవ్వలేదు. జగపతి బాబు, రిద్ది కుమార్ ట్రాక్ లు ఎందుకు పెట్టాడో.. అసలు ఏం చెప్పాలనుకున్నాడో దర్శకుడికే తెలియాలి. ప్రభాస్ తల్లి పాత్రకి భాగ్యశ్రీ వంటి బాలీవుడ్ నటిని ఎందుకు ఎంపిక చేసుకున్నారో, అతని స్నేహితుడు పాత్రకి తండ్రి పాత్రలా కనిపించే కునాల్ ను ఎందుకు ఎంపికచేసుకున్నారు. మురళీ శర్మ పాత్రకి ప్రాధాన్యత ఏముందో కూడా దర్శకుడికే తెలియాలి.

విశ్లేషణ: ప్రభాస్ ఇమేజ్ కు తగ్గట్టు ఒక్క ఫైట్ కూడా లేని ఈ ‘రాధే శ్యామ్’ మాస్ ఆడియెన్స్ ను అలరించడం కష్టమే. ఫస్ట్ హాఫ్ చాలా బోరింగ్ గా అనిపించినా ఇంటర్వెల్ నుండీ గాడిలో పడినట్టు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో ఒకటి రెండు సీన్లు విసిగించినా క్లైమాక్స్ ఎపిసోడ్ అలరిస్తుంది. ‘సాహో’ లా అయితే విసిగించదు కాబట్టి ‘రాధే శ్యామ్’ ను ఒకసారి హ్యాపీగా ట్రై చేయొచ్చు.

చిత్ర‌సీమ రేటింగ్‌: 2.75/5

ReadMore: రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు