OTT Review: O Manchi Roju Chusi Cheptha

August 28, 2022

OTT Review: O Manchi Roju Chusi Cheptha

  • Cast : , ,
  • Director :
  • Producer :
  • Banner :
  • Music :

/ 5

టైటిల్‌: ఓ మంచిరోజు చూసి చెప్తా రిలీజ్ డేట్: ఆగస్టు 26, 2022 న‌టీన‌టులు: విజయ్ సేతుపతి,గౌతమ్ కార్తీక్,నిహారిక కొణిదెల,గాయత్రి శంకర్ తదితరులు ద‌ర్శ‌క‌త్వం: అరుముగా కుమార్‌ సంగీతం: జస్టిన్‌ ప్రభాకరన్ సినిమాటోగ్ర‌ఫి: శ్రీ శరవణన్

విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో ‘ఒరు నల్లా నాల్ పాతు సొలన్’ అనే తమిళ చిత్రం రూపొందింది. మెగా డాటర్ నిహారిక, గౌతమ్ కార్తీక్ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ 2018లో విడుదలైంది. విజ‌య్ సేతుప‌తి క్రేజ్‌తో ప‌ర్వాలేద‌నిపించుకుంది. తాజాగా ఈ చిత్రం తెలుగు వెర్ష‌న్ ‘ఆహా’ ఓటీటీలో విడుదల చేశారు. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకుందో చూడండి:

కథ: యమజంకపురంలో యముడిని పూజించే యమన్(విజయ్ సేతుపతి) అలాగే అతని టీమ్‌ దొంగ‌త‌నం వృత్తిగా జీవిస్తుంటారు. ఓ దొంగతనం కోసం సిటీలోకి వస్తారు. ఈ ప్రాసెస్ లో వారికి యమన్ భార్య సౌమ్య (నిహారిక) వారికి కనిపిస్తుంది. అప్పుడు దొంగతనంతో పాటు ఆమెను కూడా కిడ్నాప్ చేస్తారు. అయితే అప్ప‌టికే ఆమె గౌతమ్ కార్తీక్ తో ప్రేమలో ఉంటుంది. అస‌లు సౌమ్య నిజంగానే య‌మ‌న్ భార్యా? భార్య అయితే ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది. తన ప్రేయసిని దక్కించుకోవడం కోసం గౌతమ్ కార్తీక్ ఏం చేశాడు అనేది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు: ఈ లిస్ట్ లో ముందుగా అలాగే మెయిన్ గా చెప్పుకోవాల్సిన నటుడు విజయ్ సేతుపతి. వింత వింత గెటప్ లతో అక్కడక్కడా తన మార్క్ కామెడీతో..ఏ మాత్రం కంటెంట్ లేని ఈ కథని తన భుజాల పై వేసుకున్నాడు. ఎంత ఓటీటీలో రిలీజ్ అయినప్పటికీ ఈ చిత్రాన్ని చివరి వరకు చూడటం అంటే చాలా కష్టమనే ఫీలింగ్ ఉంటుంది. సినిమా రన్ టైం 2 గంటల 29 నిమిషాలు ఉన్నప్పటికీ.. 3 గంటల పైనే కూర్చున్న ఫీలింగ్ కలుగుతుంది. సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ ఓ పాటతో, అక్కడక్కడ నేపథ్య సంగీతంతో ఇంప్రెస్ చేశాడు. ఎడిటింగ్ బ్యాడ్, సినిమాటోగ్రఫీ అక్కడక్కడా పర్వాలేదు. కాస్ట్యూమ్స్ ఏమాత్రం బాలేదు.

ఇక నిహారిక యాక్టింగ్ ఈ సినిమాకు పెద్ద మైన‌స్ పాయింట్‌. ఈ సినిమా తెలుగులో విడుదల చేసే ఆలోచన ఉన్నప్పుడు కనీసం ఆమె పాత్రకు తనచేతే డబ్బింగ్ చెప్పించే ప్రయత్నమైనా చేయాల్సింది. అది కూడా చేయలేదు. ఎవరో చెప్పిన వాయిస్ ఈమెకు అస్సలు సూట్ అవ్వలేదు. ఇక గౌతమ్ కార్తీక్ పాత్ర అటు సీరియస్ రోల్ అనీ చెప్పలేము ఇటు సిల్లీ రోల్ అనీ చెప్పలేము. మిగిలిన నటీనటుల పాత్రలు ఉన్నా లేన‌ట్టే..

సాంకేతిక నిపుణుల పనితీరు: దర్శకుడు అరుముగా కుమార్‌ సినిమాని ఇంట్రెస్టింగ్ గా మొదలుపెట్టాడు. ఇంటర్వెల్ కు సెకండ్ హాఫ్ లో ఏదో ఉంటుంది అనే క్యూరియాసిటీని రేకెత్తించాడు. అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ తో ఇంప్రెస్ చేశాడు. అంతకు మించి ఇతను చేసింది ఏమీ లేదు. మిగిలిన ప్లాట్ అంతా చాలా సిల్లీగా ఉంటుంది. అతను చేసిన మంచి పని ఏంటి అంటే ఈ సినిమాలో విజయ్ సేతుపతిని ఎంచుకోవడం. విజయ్ సేతుపతి సినిమా కాబట్టి.. అదీ ఓటీటీలో అందుబాటులో ఉంది కాబట్టి ఓసారి ట్రై చేద్దాం అనుకుంటే.. ఎటువంటి అంచనాలు లేకుండా చూడాలి. ఏదైనా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనుకుంటే మీ ఇష్టం.

ట్రెండింగ్ వార్తలు