ఏపీలో బంగార్రాజు చిత్రాన్ని బ్యాన్ చేయ‌నున్నారా?

January 6, 2022

ఏపీలో బంగార్రాజు చిత్రాన్ని బ్యాన్ చేయ‌నున్నారా?

ఏపీలోని సినిమా టికెట్‌ ధరల విషయంలో నాగార్జున చేసిన కామెంట్స్‌ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. బంగార్రాజు రిలీజ్‌ ప్రెస్‌ మీట్‌లో ఏపీలో ఉన్న సినిమా టికెట్‌ ధరలు నా సినిమాకు సరిపోతాయని అని నాగార్జున మాట్లాడిన మాటల పట్ల ఏపీ వ్యాప్తంగా ఉన్న డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్‌ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 14న విడుదల కావాల్సిన బంగార్రాజు సినిమాను ఏపీ వ్యాప్తంగా బహిష్కరించాలనే ఆలోచనల్లో ఉన్నారట ఎగ్జిబిటర్స్‌ అండ్‌ డిస్ట్రిబ్యూటర్స్‌. ఒకవేళ ఇదే జరిగితే ఇండస్ట్రీలో ఓ పెను సంచలనంగా చెప్పుకోవచ్చు. ఇక 2016లో వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా కు స్వీకెల్‌గా కల్యాణ్‌కృష్ణ తెరకెక్కించిన బంగార్రాజు చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఇక ఈ చిత్రంలో నాగార్జున, నాగచైతన్య, కృతీశెట్టి, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు.

Readmore..ఆకట్టుకుంటోన్న‌ `బంగార్రాజు` టీజర్

ట్రెండింగ్ వార్తలు