మంచు విష్ణు…మా బిల్డింగ్‌ ఎక్కడ?

January 4, 2022

మంచు విష్ణు…మా బిల్డింగ్‌ ఎక్కడ?

MAABuilding: ‘మా’(మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత ‘మా’ బిల్డింగ్‌ను వీలైనంత తొందరగా పూర్తి చేస్తానని, అవసరమైతే ‘మా’ బిల్డింగ్‌ను సొంత డబ్బులతో నిర్మిస్తానని మంచు విష్ణు ప్రగల్భాలు పలికారు. మరో సందర్భంలో ‘మా’ బల్డింగ్‌ నిర్మాణం కోసం బాలకృష్ణగారిని కలుపుకుని వెళ్తాం అన్నారు. రీసెంట్‌గా మా ఆధ్వర్యంలో జరిగిన హెల్త్‌ క్యాంపులో పాల్గొన్న మంచు విష్ణు..మా బిల్డింగ్‌పై ఓ వారంలో ప్రకటన చేస్తానని అన్నారు. ఈ వారం గడిచిపోయి ఇంకొన్ని వారాలు అవుతున్న మా బిల్డింగ్‌పై మాత్రం మంచు విష్ణు మౌనంగానే ఉంటున్నారు. ‘మా’ ఎలక్షన్స్‌కు వారం రోజుల ముందు ‘మా’ బిల్డింగ్‌ కోసం మూడు స్థలాలను చూశానని చెప్పిన మంచు విష్ణు ఇప్పుడు ఏం చేస్తున్నారో మరి.

ReadMore: ఇకనైనా నోర్లు తెరవండి…టాలీవుడ్‌ హీరోల‌కు వర్మ డిమాండ్‌.

Related News

ట్రెండింగ్ వార్తలు