Liger Movie Review: పూరి క‌థ‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ హిట్ కొట్టాడా?

August 25, 2022

Liger Movie Review: పూరి క‌థ‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ హిట్ కొట్టాడా?

  • Cast : , ,
  • Director :
  • Producer :
  • Banner :
  • Music :

/ 5

టైటిల్‌: లైగ‌ర్‌
తారాగణం: విజయ్‌ దేవరకొండ, అనన్యాపాండే, రమ్యకృష్ణ, రోనిత్‌ రాయ్, విషు రెడ్డి, అలీ, చుంకీ పాండే దర్శకత్వం: పూరీ జగన్నాథ్‌ నిర్మాణం: పూరీ జగన్నాథ్, చార్మీ, అపూర్వా మెహతా, కరణ్‌జోహార్‌ డీవోపీ: విష్ణు శర్మ

కథ: ఎమ్‌ఎమ్‌ఎ(మిక్డ్స్‌ మార్షల్‌ ఆర్ట్స్‌) జాతీయ చాంపియన్‌ కావాలన్నది లైగర్‌ (విజయ్‌ దేవరకొండ) లక్ష్యం. ప్రఖ్యాత బాక్సర్‌ మైక్‌టైసన్‌కు వీరాభిమాని లైగర్‌. టైసన్‌తో ఓ సెల్ఫీ తీసుకోవాలనేది లైగర్‌ కల. ఇక లక్ష్యం కోసం సొంత ఊరు కరీంనగర్‌ నుంచి లైగర్, అతని తల్లి బాలామణి (రమ్యకృష్ణ) ముంబై వస్తారు. కోచ్‌ కేశవ (రోనిత్‌ రాయ్‌ ) నేతృత్వంలో ముంబైలో ఉండే ఎమ్‌ఎమ్‌ఎ ట్రైనింగ్‌ అకాడమీలో బాయ్‌గా లైగర్‌ జాయిన్‌ అవుతాడు. లైగర్‌లోని ఆసక్తి, ప్రతిభను గుర్తించిన కోచ్‌ అతనికి శిక్షణ ఇచ్చేందకు సిద్ధం అవుతాడు. కానీ ఎమ్‌ఎమ్‌ఎపై ఫోకస్‌ పెట్టాలంటే ప్రేమకు దూరంగా ఉండాలంటాడు కోచ్‌. ఇదే విషయాన్ని లైగర్‌కు అతని తల్లి బాలామణి కూడా చెబుతుంది. కానీ ఈ క్రమంలోనే తానియా (అనన్యా పాండే)తో లవ్‌లో పడతాడు లైగర్‌. ఇక ముంబైలోనే మరో ఎమ్‌ఎమ్‌ఏ ట్రైనింగ్‌ సెంటర్‌ను నిర్వహిస్తుంటాడు తానాయా అన్న సంజు (విష్‌). దీంతో లైగర్‌కు, సంజు తరచూ గొడవలు పడుతుంటారు. మరి..లైగర్‌ స్టేట్‌ చాంపియన్‌ షిప్‌ను ఎలా సాధించాడు? అతని సెల్ఫీ కల నిజమైందా? ధనవంతురాలైన తానాయా ప్రేమను లైగర్‌ ఎలా పొందగలిగాడు అన్న అంశాలను స్క్రీన్‌పై చూడాలి.

విశ్లేషణ హీరో చాంపియన్‌ కావాలనుకోడం, మధ్యలో హీరోయిన్‌తో ప్రేమలో పడి లక్ష్యం నుంచి డీవీయేట్‌ కావడం, మళ్లీ కోచ్, కుటుంబ సభ్యుల మాటలతో ప్రేరణ పొంది లక్ష్యం సాధించడం…ఇది ఎప్పట్నుంచో ప్రేక్షకులు చూస్తూనే ఉన్న స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ సినిమాల మూస ధోరణి కథ. ‘లైగర్‌’ స్టోరీ కూడా ఇదే. పూరీ స్టైల్‌ ఆఫ్‌రిచ్‌ నెస్‌ స్క్రీన్‌పై కనిపిస్తుందే కానీ కథ ఏ మాత్రం కొత్తగా లేదు. ట్రైనింగ్‌ సెంటర్, ట్రైన్‌ ఫైట్‌..ఇలా రెండు మూడు సీన్స్‌ అయితే బాగున్నాయి. అది విజయ్‌దేవరకొండ స్వాగ్‌ వల్లే తప్ప. అవి కూడా కొత్త సీన్స్‌ ఏం కావు. సాధారణంగా పూరీ సినిమాల్లోని హీరో క్యారెక్టరైజేషన్స్‌ పవర్‌ఫుల్‌గా ఉంటాయి. కానీ ఈ సినిమాలోహీరో క్యారెక్టర్‌కు , అదీ విజయ్‌ దేవరకొండ లాంటి స్టార్‌కు ఓ డిఫెక్ట్‌ను(నత్తి)ను పెట్టడం ఆడియన్స్‌కు రుచించడం లేదు. కేవలం నత్తి ఉండటం వల్లే హీరో ప్రేమను హీరోయిన్‌ కాదనడం అనేది కథలో లవ్‌ ట్రాక్‌ ఎంత వీక్‌నో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా క్లైమాక్స్‌ను పూరీ డీల్‌ చేసిన విధానం అయితే వరస్ట్‌ అని చెప్పవచ్చు. ఓ ప్రణాళిక ప్రకారం అమెరికాలో జరిగే మిక్ట్స్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ వరల్డ్‌ చాంపియన్‌ షిప్‌ను వదిలేసి ఎక్కడో జరుగుతున్న ఫైట్‌ను ఫైనల్‌ స్టేజ్‌పై స్ట్రీమింగ్‌ ఇవ్వడం, దాంట్లో విజయ్‌ గెలిచి చాంపియన్‌ అవ్వడం మహాద్భుతమనే చెప్పాలి. సినిమాలో రమ్యకృష్ణ భర్త పేరు బలరాం. వివిధ సందర్భాల్లో బలరాం ప్రస్తావన వస్తుంది కానీ ఆయన ఎవరో, ఎందుకు చనిపోయారో అనేది ఎవరికీ తెలియదు. స్క్రీన్‌పై కనిపించదు. మధ్య మధ్యలో బూతులు ఆడియన్స్‌కు స్పెషల్‌ గిప్ట్స్‌. అక్డీ పక్డీ తప్ప ఏ పాట స్క్రీన్‌పై ఆడియన్స్‌కు ఊపునివ్వదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలనే ఉన్నాయి ‘లైగర్‌’ తప్పులు.

ఎవరు ఎలా చేశారంటే! లైగర్‌ పాత్రలో విజయ్‌ దేవరకొండ ఉన్నంతలో బాగా చేశాడు. విజయ్‌ క్యారెక్టర్‌కు నత్తి కాబట్టి పెద్ద పెద్ద డైలాగ్స్‌ చెప్పే చాన్స్‌లు లేవు. అయితే ఫైటర్‌గా విజయ్‌ ట్రాన్ఫర్మేషన్, యాక్షన్‌ ఎక్స్‌ప్రేషన్స్‌ బాగున్నాయి. స్క్రీన్ పై వచ్చినప్పుడు కాస్త హడావిడి చేయడం తప్ప అనన్యపాండే చేసింది ఏమీ లేదు. నిజానికి పెద్ద యాక్టింగ్‌ చేసేంత పాత్రం ఏం కాదు తానియాది. బిజినెస్‌పై కాకుండా కథపై మరింత కసరత్తు చేసి ఉంటే పూరీ ఖాతాలో మరో హిట్‌ చేరి ఉండేది. విలన్‌గా నటించిన విష్‌ కాస్త ఫర్వాలేదనిపించాడు. సినిమా స్టార్టింగ్‌ నుంచి మైక్‌టైసన్‌ అంటూ ప్రత్యేకంగా టీమ్‌ ప్రమోట్‌ చేసింది సినిమాను. కానీ కథలో మైక్‌టైసన్‌కు పెద్ద సీన్‌ ఏం లేదు. ఫైట్‌ కూడా బల్లలు విరిగిపడటం, పరిగెత్తడం వంటివి తప్ప పెద్ద మూమెంట్స్‌ ఏమీ లేదు. అసలు మైక్‌టైసన్‌ను తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఇదో ప్రమోషన్‌ స్టంట్‌ అంతే. ఇక రోనిత్‌రాయ్, చుంకీపాండే, అలీ వారి వారి పాత్రల మేరకు మెప్పించే ప్రయత్నం చేశారు. మ్యూజిక్, కెమెరా గురించి పెద్దగా మాట్లాడు కోవాల్సిన పని లేదు. ఇలా మొత్తంగా ‘లైగర్‌’ ఆడియన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచాడు.

బలాలు విజయ్‌దేవరకొండ స్టైల్‌ ఆఫ్‌ యాక్టింగ్‌ (అక్కడక్కడ)

బలహీనతలు బలం లేని కథనం హీరో హీరోయిన్‌ లవ్‌ ట్రాక్‌ క్లైమాక్స్, పాటలు

ఫైనల్‌: దారి తప్పిన లైగర్‌

చిత్ర‌సీమ రేటింగ్‌: 2/5

ట్రెండింగ్ వార్తలు