Cobra Movie Review: కోబ్రాతో విక్ర‌మ్ హిట్టుకొట్టాడా?

August 31, 2022

Cobra Movie Review: కోబ్రాతో విక్ర‌మ్ హిట్టుకొట్టాడా?

కోబ్రా రివ్యూ

తారాగణం: విక్రమ్, శ్రీ నిధి శెట్టి, మీనాక్షీ చౌదరి, ఇర్ఫాన్‌ పఠాన్, కేఎస్‌ రవికుమార్, మియా జార్జ్‌ రచన, దర్శకత్వం: అజయ్‌ జ్ఞానముత్తు నిర్మాత: ఎస్‌ఎస్‌ లలిత్‌కుమార్‌ సంగీతం: ఏఆర్‌ రెహమాన్‌ డీవోపీ: హరీష్‌ కన్నన్‌ ఎడిటర్‌: భువన్‌ శ్రీనివాస్‌

విక్రమ్‌ సినిమా అంటే ప్రేక్షకుల్లో ఓ మాదిరి అంచనాలు ఉంటాయి. విక్రమ్‌ ఎంచుకునే కథలు, ఈ కథల్లోని పాత్రకు తగ్గట్లు విక్రమ్‌ మారిపోయే తీరు ప్రేక్షకులకు కాస్త బాగా అనిపిస్తాయి. అలా అనీ విక్రమ్‌ సినిమా చేసిన సినిమా అల్లా ఆడియన్స్‌కు నచ్చిందనేం చెప్పాలం. దాదాపు ఐదు సంవత్సరాలుగా విక్రమ్‌ ఓ భారీ హిట్‌ కోసం చూస్తున్నాడు. మరి..ఇలాంటి సమయంలో వచ్చిన విక్రమ్‌ తాజా చిత్రం ‘కోబ్రా’ ఏ మాత్రం ఆకట్టుకుంది? అనేది చూద్దాం.

కథ: చెన్నైలో ఓ జీనియస్‌ మ్యాథమ్యాటిషియన్‌ మధి (విక్రమ్‌). తన ఊహాల లోకంలో హాయిగా జీవి స్తుంటాడు. మరోవైపు సొసైటీలో చాలా పలుకుబడి ఉన్న ప్రముఖులు విభిన్న రకాలుగా హాత్య చేయబడుతుంటారు. ఈ హంతకుడి పేరు కోబ్రా. డిఫరెంట్‌ గెటప్స్‌లో వెళ్లి కోబ్రా హత్యలు చేస్తుంటాడు. అయితే కోబ్రాను పట్టుకునేందుకు ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌ అస్లాన్‌ (ఇర్ఫాన్‌పఠాన్‌) రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో మధియే కోబ్రా అని తెలుస్తుంది. అసలు..మధి ఎందుకు హత్యలు చేస్తున్నాడు? కోబ్రాగా ఎందుకు మారాడు? కోబ్రాను అస్లాన్‌ ఏ విధంగా పట్టుకోగలిగాడు? అన్నది మిగిలిన కథ.

విశ్లేషణ ‘ఈ సినిమా కేవలం గెటప్స్‌ను గురించే కాదు..మంచి కథ ఉంది’ అని కోబ్రా ప్రమోషన్స్‌లో చెప్పారు విక్రమ్‌. కానీ విక్రమ్‌ చెప్పిన మాటలు సంగం వరకే నిజం అనిపిస్తుందెమో. ఈ సినిమాలో గెటప్స్‌ ఉన్నాయి కానీ కథలో మాత్రం బలమైన పస లేదు. సినిమాలో చాలా ఫజిల్స్, ఓ సామాన్యప్రేక్షకుడికి అర్థం కానీ స్క్రీన్‌ ప్లే ఉంటుంది. కథలో ముఖ్యమంత్రిని కోబ్రా ఎలా చంపాడు? అనేందుకు దర్శకుడు అజయ్‌ జ్ఞానముత్తు ఓ మ్యాథ్స్‌ థియరీ చెబుతాడు. అలాగే చర్చిలో ఓ రసాయనంతో కోబ్రా హాత్య చేయడం. ఇలాంటి సన్నివేశాలు విజువల్‌గా బాగానే ఉన్నాయి కానీ అర్థం చేసుకోవడంలో ఫుల్‌ కన్‌ఫ్యూజన్‌ తలెత్తుంది. పైగా విక్రమ్‌ గెటప్స్‌ అన్ని ఫస్టాఫ్‌లోనే పూర్తి అవుతాయి. దీంతో కథలోకి వెళ్తాం. కానీ మధి చైల్డ్‌హుల్డ్, ప్లాష్‌బ్యాక్‌ సన్నివేశాలు ప్రేక్షకుల సహనాన్ని పరీ క్షిస్తాయి. ఇటు లవ్‌ ట్రాక్‌ కూడా పెద్దగా ఆసక్తికరంగా సాగదు. పాటలు ఈ సినిమాకు ఫ్లస్‌ కాలేకపోయాయి. వీటికి తోడు మూడు గంటల రన్‌టైమ్‌ మరో మైనస్‌గా చెప్పుకోవచ్చు. ఎడిటింగ్‌ రూమ్‌లో దాదాపు ఓ ఇరవై నిమిషాలను తగ్గించే వెసులుబాటు ఉన్నా దర్శకుడు ఎందుకో ఆ ప్రయత్నం చేయదలుచుకోలేదెమో! అనిపిస్తుంది. సినిమాలో అసలు విలన్‌ (మలయాళ నటుడు రోషన్‌ మాథ్యూ) ఉన్న లక్ష్యం ఏంటో ఓ పట్టాన ప్రేక్షకుల బుర్ర కు ఎక్కదు. విలన్‌ క్యారెక్టర్‌ డిజైన్‌ మాత్రం బాగానే ఉంది. అయితే ఇంట్రవెల్‌లో వచ్చే ట్విస్ట్, ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం, బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ సినిమాలో అదుర్స్‌ అనిపిస్తాయి.

ఎవరు ఎలా చేశారంటే! డిఫరెంట్‌ గెటప్స్‌లో విక్రమ్‌ పవర్‌ఫుల్‌గా యాక్ట్‌ చేయగలడని, అతనిలో ఆ సత్తా ఉందని ప్రేక్షకులు ఎప్పుడో ఒప్పుకున్నారు. ఇందుకు ఓ ఉదాహరణ విక్రమ్‌ చేసిన ‘అపరిచితుడు’ సినిమానే చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ప్రూవ్ అయిన దాన్ని విక్రమ్‌ మళ్లీ మళ్లీ ఎందుకు నిరూపించాలని ప్రయత్నిస్తున్నాడో అర్థం కావడం లేదు. కోబ్రా సినిమాలో విక్రమ్‌ కష్టం కనపడుతుంది. కానీ కథలోనే బలం లేదు. కన్‌ఫ్యూజన్, ఆన్సర్స్‌ లేని క్వశ్చన్స్‌ ఆడి యన్స్‌ను ఇబ్బంది పెడుతున్నాయి. దర్శకుడు అజయ్‌ జ్ఞానముత్తు ఓ సామాన్య ప్రేక్షకుడిని కూడా దృష్టిలో పెట్టుకుని కథ రాసి ఉంటే బాగుండేది. అజయ్‌కు ప్రతిభ ఉంది. కానీ తన ఫజిల్స్‌ను సాల్వ్‌ చేయడం ప్రేక్షకుల పని కాదు. ఆడియన్స్‌కు కావాల్సింది ఆకట్టుకునే స్క్రీన్‌ ప్లే, కథ, కథనం, వినోదం మాత్రమే. వీటిని ప్రాపర్గా అందించడంలో అజయ్‌ విఫలైమయ్యారనే చెప్పవచ్చు. ఇక తొలిసారి తెరపై కనిపించిన ఇండియా మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ఒకే అనిపించారు. కానీ డైలాగ్‌ డెలివరీ ఇంకా మెరుగ్గా ఉండి ఉండాల్సింది. హీరోయిన్స్ శ్రీనిధి శెట్టి, మృణాళిని రవి, మీనాక్షీ చౌదరి వారి పాత్ర పరిధి మేరకు వారు చేశారు. కానీ ఇది సినిమాకు ఫ్లస్ కాలేదు. మలయాళ నటుడు రోషన్, గోవిందరాజన్, జాన్‌ విజయ్‌ పాత్రలు కూడా అంతే.

ఫైనల్‌గా:కన్‌ఫ్యూజన్‌ కోబ్రా

చిత్ర‌సీమ రేటింగ్‌: 2/5

TRENDING NOW