Chakda Xpress: జూలన్‌ గోస్వామిగా అనుష్క శ‌ర్మ‌..టీజర్‌ అదిరిందిగా…

January 6, 2022

Chakda Xpress: జూలన్‌ గోస్వామిగా అనుష్క శ‌ర్మ‌..టీజర్‌ అదిరిందిగా…

టీమ్ ఇండియా మహిళా క్రికెట్ దిగ్గజం, ఫాస్ట్ బౌలర్ జూలన్ గోస్వామి గురించి అంద‌రికీ తెలిసిందే.. పశ్చిమ బెంగాల్‌లోని చక్దాహాలో జన్మించిన జూలన్ తన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను అందుకున్నారు. వన్డే క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా జూలన్ గోస్వామి రికార్డుల్లో నిలిచింది. అంతే కాకుండా వన్డేల్లో 200 వికెట్లు తీసిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కింది. భారత్‌ తరుపున 12 టెస్టులు, 192 వన్డేలు, 68 టీ20 ఆడిన గోస్వామి వరుసగా 44, 240, 56 వికెట్లు సాధించింది.

Read More: MaheshBabu: మహేశ్‌బాబుకు కరోనా పాజిటివ్‌.. ఆందోళ‌న‌లో ఫ్యాన్స్‌..!

తాజాగా జూలన్‌ గోస్వామి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న “చక్దా ఎక్స్‌ప్రెస్” చిత్రం టీజర్‌ విడుదలైంది. ఈ బయోపిక్‌లో గోస్వామి పాత్రలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌, విరాట్ కోహ్లి భార్య‌ అనుష్క శర్మ నటిస్తోంది. ఈ మూవీలో భారత క్రికెట్‌కు గోస్వామి అందించిన సేవలను, సాధించిన రికార్డులను చూపించనున్నారు. ఈ సినిమాకు ప్రోసిత్ రాయ్ దర్శకత్వం వహిస్తుండగా, అనుష్క శర్మ, ఆమె సోదరుడు కర్ణేష్‌ శర్మ క్లీన్ స్లేట్ ఫిల్మ్జ్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది

Read More: సురేష్‌ ప్రొడక్షన్స్‌: ఇక్కడ రీమేక్‌లు చేయబడును

టీజ‌ర్ విడుద‌లైన సంద‌ర్భంగా .. చక్దా ఎక్స్‌ప్రెస్ నాకు నిజంగా ప్రత్యేకమైన చిత్ర‌మ‌ని.. ఈ మూవీ మహిళా క్రికెట్‌ విలువను క‌చ్చితంగా ప్రపంచానికి తెలియజేస్తుంద‌ని అనుష్క శర్మ తెలిపింది.

Related News

ట్రెండింగ్ వార్తలు