Brahmastra First Review: `బ్ర‌హ్మాస్త్రం` ఫ‌స్ట్ రివ్యూ వ‌చ్చేసింది

September 7, 2022

Brahmastra First Review: `బ్ర‌హ్మాస్త్రం` ఫ‌స్ట్ రివ్యూ వ‌చ్చేసింది

ఉమైర్‌ సంధు..సోష‌ల్ మీడియాని కొద్దిగా ఫాలో అవుతున్న ప్ర‌తి ఒక్క‌రికీ ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. ఓవ‌ర్‌సిస్ సెన్సార్‌బోర్డు మెంబ‌ర్ అని త‌న‌కి తానే చెప్పుకున్నాడు(ఈ విష‌యాన్ని అక్క‌డి అధికారులు దృవీక‌రించ‌లేదు).. కాని కొత్త సినిమా వ‌స్తుందంటే చాలు వారం రోజుల ముందే ఆ సినిమా రివ్యూ చెప్పేస్తుంటాడు ఈ మ‌హానుభావుడు. దానికి రేటింగ్ కూడా భారీగానే ఇస్తుంటాడు. అత‌డు ఇచ్చే రేటింగ్స్‌కి సినిమాకి సంభందం ఉండ‌దు అది వేరే విష‌యం. రీసెంట్‌గా రిలీజైన లైగ‌ర్ సినిమాకి ముందే సూప‌ర్‌హిట్ రేటింగ్ ఇచ్చేశాడు..కాని రిలీజైన త‌ర్వాత సినిమా డిజాస్ట‌ర్ గా మిగిలింది. స‌రే ఇప్పుడు విష‌యం ఏంటంటే బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ జంటగా నటించిన చిత్రం బ్రహ్మాస్త్రం. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగార్జున, అమితాబ్‌ బచ్చన్‌, మౌనీరాయ్‌ ముఖ్య పాత్రలు పోషించారు దక్షిణాదిలో ఈ సినిమాను ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి సమర్పిస్తున్నారు. దాంతో ఈ సినిమాపై మంచి బ‌జ్ ఏర్ప‌డింది. అయితే రిలీజ్‌కి మూడు రోజులు ముందుగానే ఉమైర్‌ సంధు బ్ర‌హ్మాస్రం రివ్యూ చెప్పేశాడు.

‘బ్ర‌హ్మాస్రం సినిమాలో వీఎఫ్‌ఎక్స్‌తో కొన్ని సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయ‌ని. సినిమాటోగ్రఫీ కనుల విందు చేస్తుంద‌ని చెప్పుకొచ్చాడు. అయితే కథ, స్క్రీన్‌ప్లే యావరేజ్ అని ఆలియా భట్‌, మౌనీరాయ్‌ నటన అద్భుతం అని కొనియాడాడు. అమితాబ్‌ బచ్చన్‌ కనిపించే సీన్స్‌కి థియేట‌ర్స్ విజిల్స్‌తో మారుమ్రోగుతాయ‌ని చెప్తూనే..అతడి పాత్ర నిడివి చాలా తక్కువ అని తేల్చేశాడు. బాలీవుడ్‌లో ఫాంటసీ సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయ‌ని… అలాంటిది ఆ లైన్‌లో సినిమా తీసిన అయాన్‌ ముఖర్జీ ధైర్యాన్ని అభినందించాల్సిందే’అని ట్వీట్‌ చేశాడు. మ‌రి చూడాలి ఈ సారైన ఉమైర్‌ సంధు చెప్పిన రివ్యూ నిజం అవుతుందో లేదో!

ట్రెండింగ్ వార్తలు