ఒకే వేధిక‌పై సంద‌డిచేయ‌నున్న‌ అల్లు అర్జున్ – స‌ల్మాన్ ఖాన్

November 29, 2021

ఒకే వేధిక‌పై సంద‌డిచేయ‌నున్న‌ అల్లు అర్జున్ – స‌ల్మాన్ ఖాన్
టాలీవుడ్ ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌ ప్రస్తుతం పుష్ప చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఒక సాంగ్ మిన‌హా మిగ‌తా షూటింగ్ పూర్త‌య్యింద‌ని తెలుస్తోంది. అల్లు అర్జున్ – స‌మంతపై తెర‌కెక్కించే ఆ స్పెష‌ల్ సాంగ్ షూటింగ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్లోని రామోజీఫిలిం సిటీలో వేసిన భారీ సెట్లో జ‌రుగుతుంది. ఢీ షో ద్వారా పాపుల‌ర్ అయిన య‌శ్ మాస్ట‌ర్ ఈ పాట‌కు కొరియోగ్ర‌ఫి చేస్తున్నారు. రిలీజ్‌డేట్ ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌డంతో ఈ సాంగ్ పూర్త‌యిన వెంట‌నే అన్నిభాష‌ల్లో ప్రమోషన్స్‌ను మ‌రింత వేగ‌వంతం చేయ‌నున్నారు చిత్ర యూనిట్‌. ఇక హిందీలో ఈ మూవీని ప్రమోట్‌ చేసేందుకు స్వయంగా బన్నీనే రంగంలోకి దిగుతున్నాడని తెలుస్తోంది. బాలీవుడ్ కండ‌ల‌వీరుడు సల్మాన్‌ ఖాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న హిందీ బిగ్‌బాస్‌ 15వ సీజన్‌లో బన్నీ, సుకుమార్‌లు స్పెష‌ల్ గెస్ట్‌గా ఎంట్రీ ఇవ్వ‌నున్నార‌ట‌. ఇటీవ‌ల‌ డీజేలోని సీటీమార్ పాట‌ను త‌న రాధే సినిమాలో వాడుకున్నాడు స‌ల్మాన్ ఖాన్‌. ఈ సంద‌ర్భంగా బ‌న్నీతో ఫోన్లో మాట్లాడాడ‌ట స‌ల్మాన్. అప్ప‌టినుండి వీరిద్ద‌రి మధ్య మంచి అనుభందం ఏర్ప‌డింది. పుష్ప సినిమా హిందిలో కూడా రిలీజ‌వుంది. దాంతో అక్క‌డ‌ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా స‌ల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న‌ బిగ్‌బాస్ కి వెళ్ల‌నున్నాడ‌ట అల్లు అర్జున్‌.

ట్రెండింగ్ వార్తలు