అల్ల‌రి న‌రేష్ `ఉగ్రం` మూవీ రివ్యూ, రేటింగ్‌

May 5, 2023

అల్ల‌రి న‌రేష్ `ఉగ్రం` మూవీ రివ్యూ, రేటింగ్‌

చిత్రం: ఉగ్రం నటీనటులు: అల్లరి నరేష్, మిర్న మీనన్ , ఇంద్రజ తదితరులు డైరెక్టర్ : విజయ్ కనకమేధాల మ్యూజిక్ : శ్రీ చరణ్ పాకాల కథ : టోమ్ వెంకట్ నిర్మాత‌: షైన్ స్క్రీన్

తెలుగు సినీ ప్రేక్షకులకు అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. కెరీర్ ఆరంభంలో కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన అల్లరి నరేష్ ఆ తరువాత మాత్రం వాటి పైనే ఆధారపడలేదు. నేను, విశాఖ ఎక్స్ప్రెస్, శంభో శివ శంభో, గమ్యం, మహర్షి వంటి చిత్రాలలో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇక ఆ తర్వాత నాంది అనే చిత్రంతో తన రూట్ మార్చేశాడు అల్లరి నరేష్. కామెడీ కథలకు స్వస్తిపలికి సీరియస్ కథలతో ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రయత్నిస్తున్నాడు. తాజాగా అల్లరి నరేష్, విజయ్ కనకమెడల దర్శకత్వంలో మరో మూవీ తెరకెక్కింది. ఉగ్రం పేరుతో రూపొందిన ఈ చిత్రంలో అల్లరి నరేష్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. ఈ సినిమా క‌థ ఏంటి, మూవీ ఎలా ఉందో చూద్దాం.

క‌థ‌: శివ కుమార్ (అల్ల‌రి న‌రేష్‌) వరంగల్ సిటీలో ఉండే ఒక నిజాయితీ గల పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్. ఎలాంటి క్లిష్టమైన కేసు ని అయినా చాలా తేలికగా పరిష్కరిస్తుంటాడు. అలా సాగిపోతున్న శివ కుమార్ జీవితంలోకి అపర్ణ (మిర్న) వస్తుంది. ఆమెతో తొలిచూపు లోనే ప్రేమలో పడుతాడు శివ, అపర్ణ కూడా శివని ప్రేమించి తన తండ్రిని ఎదిరించి మరీ శివని పెళ్లి చేసుకుంటుంది. అలా 5 సంవత్సరాలు శివతో కలిసి ఎంతో సంతోషంగా దాంపత్య జీవితం కొనసాగిస్తూ ఒక బిడ్డకి జన్మని ఇస్తుంది. అయితే ఒకరోజు శివతో కలిసి బయటకి వెళ్లి వస్తున్నా సమయంలో కుటుంబం మొత్తానికి యాక్సిడెంట్ అవుతుంది.ఈ యాక్సిడెంట్ లో శివ తన మెమరీని కోల్పోతాడు, అలాగే భార్య, బిడ్డ కనిపించకుండా పోతారు. కేవలం ఆయన భార్య బిడ్డ మాత్రమే కాదు, సిటీలో ఎంతోమంది అలా కనిపించకుండా పోతారు. వాళ్ళందరిని వెతికి తిరిగి తీసుకొచ్చే క్రమంలో శివకి ఎదురైనా సవాళ్లు ఏమిటి..చివరికి అందరినీ కాపాడుతాడా లేదా అనేదే స్టోరీ.

ప‌ర్‌ఫార్మెన్స్: పోలీస్ రోల్ లో అల్లరి నరేష్ ప్రేక్ష‌కుల‌ని అల‌రించారు. సినిమా కోసం ఆయన ట్రాన్స్ఫర్మేషన్ మెప్పిస్తుంది. పాత్రలో ఒదిగిపోయి నటించగా ఆయనలోని కామెడీ యాంగిల్ అస‌లు ఎవ‌రికి గుర్తుకు రాదు. కాక‌పోతే కామెడీ చిత్రాల హీరోకి ఈ రేంజ్ ఎలివేషన్స్ అవసరమా అనే భావన కలుగుతూ ఉంటుంది. కాని ఆయన బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్ ఎవ‌రికి ఆ ఫీలింగ్ రానివ్వ‌కుండా చేశాయి. నరేష్ భార్య గా మిర్నా బాగానే న‌టించింది. డాక్ట‌ర్ పాత్ర‌లో ఇంద్ర‌జ ఒద‌గిపోయింది. మిగిలిన పాత్ర‌లు కూడా ప్రేక్ష‌కులని మెప్పిస్తాయి.

ఇక టెక్నిక‌ల్ విష‌యానికి వ‌స్తే.. దర్శకుడు విజయ్ రాసుకున్న కథ బాగున్నా.. కథనాన్ని ఆయన నడిపించిన తీరు అంత‌గా ఎఫెక్ట్‌గా అనిపించ‌దు. ఫస్టాఫ్ సినిమా చాలా నెమ్మదిగా సాగుతుంది..లవ్ ట్రాక్ కూడా పెద్ద‌గా వర్కౌట్ కాలేదు. సినిమా ప్రారంభమైన 20 నిమిషాల తరవాత నుంచి ట్రాక్ ఎక్కుతుంది.. ఇంటర్వెల్ సీక్వెన్స్ కాస్త బాగుంది. మిస్టరీని సాల్వ్ చేయడం, ట్విస్టులు, థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేషన్ సెకండాఫ్‌లో ప్రేక్షకుడికి కాస్త ఊర‌ట క‌లిగిస్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది, సన్ షైన్ సంస్థ కూడా క్వాలిటీ విషయం లో ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాని తీశారు. మితిమీరిన ఫైట్ సన్నివేశాలు, అవసరం లేని సెంటిమెంట్ సీన్స్ ని తీసేసి ఉంటే ఈ చిత్రం సమ్మర్ లో పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచేది.

ప్ల‌స్ పాయింట్స్ న‌రేష్ ప‌ర్‌ఫార్మెన్స్ ట్విస్ట్‌లు ఇంట‌ర్వెల్ సీక్వెన్స్

మైన‌స్ పాయింట్స్: ల‌వ్ స్టోరీ సీక్వెన్స్ నెమ్మ‌దించిన క‌థ‌నం ఫ‌స్టాఫ్

చివ‌రిగా: ‘నాంది’ మ్యాజిక్‌ను ‘ఉగ్రం’ సినిమాతో నరేష్, విజయ్ రిపీట్ చేయలేక‌పోయారు న‌రేష్‌, విజ‌య్ కాంబో. క‌థ బాగానే ఉన్నా విజ‌య్ స్క్రీన్ ప్లేలో కాస్త డిజ‌ప్పాయింట్ చేశాడు.ఇన్వెస్టిగేషన్‌లో కూడా కథనం కాస్త నెమ్మదిగా ఉండటం మైనస్. రోటీని మాస్ యాక్షన్ డ్రామాలా ఉగ్రం సాగింది. యాక్ష‌న్ సినిమాల‌ని ఇష్ట‌ప‌డే వారికి ఈ మూవీ కాస్త టైం పాస్ మూవీగా ఉంటుంది.

చిత్రసీమ రేటింగ్: 2.75/ 5

ఇంకా చ‌ద‌వండి: రామ‌బాణం రివ్యూ, రేటింగ్‌

ట్రెండింగ్ వార్తలు