`సుందరి’గా వ‌చ్చేందుకు డేట్ ఫిక్స్‌చేసుకున్న పూర్ణ‌

July 27, 2021

`సుందరి’గా వ‌చ్చేందుకు డేట్ ఫిక్స్‌చేసుకున్న పూర్ణ‌

హీరోయిన్ పూర్ణ లీడ్ రోల్‌లో నటిస్తోన్న చిత్రం ‘సుందరి’. రిజ్వాన్ ఎంట‌ర్టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటోన్న ఈ హీరోయిన్ సెంట్రిక్ ఫిలింలో అర్జున్ అంబాటి కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుద‌ల‌కి సిద్ద‌మైంది. ఆగ‌స్ట్‌13న థియేట‌ర్స్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ.. న‌వ‌గ్ర‌హ కుండ‌లి ముందు పూర్ణ ఉన్న ఓ పోస్టర్‌ని చిత్రయూనిట్ విడుదల చేసింది. నాట‌కం ఫేమ్ క‌ళ్యాణ్ జీ గోగ‌న డైరెక్ష‌న్‏లో ఫ్యామిలీడ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రానికి రిజ్వాన్ నిర్మాత‌. ‘ది ఆల్టిమేట్ డెసిష‌న్ ఆఫ్ ఎన్ ఇన్నోసెంట్ లేడీ’ అనే ట్యాగ్‌లైన్‌తో రాబోతోన్న ఈ చిత్రానికి సురేష్ బొబ్బ‌లి సంగీతం అందించారు.