సినిమాల్లో విలువలు మాట్లాడటం ఒక ఎత్తైతే, దాన్ని నిజ జీవితంలో ముందుకు తీసుకెళ్ల‌డం ఎంతో క‌ష్ట‌త‌రం

September 26, 2021

సినిమాల్లో విలువలు మాట్లాడటం ఒక ఎత్తైతే, దాన్ని నిజ జీవితంలో ముందుకు తీసుకెళ్ల‌డం ఎంతో క‌ష్ట‌త‌రం

పాలిటిక్స్‌లో హూందాత‌నం పోయి… దిగ‌జారుడుత‌నం వచ్చేసింది

సాయితేజ్ త‌న శైలికి భిన్నంగా న‌టించిన పొలిటికల్ థ్రిల్ల‌ర్ ‘రిప‌బ్లిక్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజ‌రైన ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఘాటైన వ్యాక్య‌ల‌తో విరుచుకుప‌డ్డారు. దేవ‌క‌ట్టాగారు చేసిన ప్ర‌స్థానం సినిమా చూశాను. చాలా చ‌క్క‌టి సినిమా. ఆటోన‌గ‌ర్ సూర్య చేసినప్పుడు ఆ నిర్మాత‌లు క‌లిసి చాలా చ‌క్క‌టి ద‌ర్శ‌కుడు అని చెబుతుండేవారు. రిప‌బ్లిక్ సినిమాను కూడా సామాజిక స్పృహ‌తో చేశారు. భార‌త రాజ్యాంగం ఏం చెప్పింది. మ‌న ప్రాథ‌మిక హ‌క్కులేంటి? అనే దానిపై మాట్లాడే సినిమా అని అర్థ‌మ‌వుతుంది. జైహింద్ అని నేను ప్ర‌తి స‌భ‌లో చెబుతుంటాను. ఓ భ‌గ‌త్ సింగ్‌, సుభాష్ చంద్ర‌బోస్‌, చంద్ర‌శేఖ‌ర్ ఆజాద్‌, మ‌హాత్మాగాంధీజీ వంటి వేల‌కొల‌ది మ‌హానుభావులు ప్రాణ త్యాగం చేస్తే కానీ, భార‌త దేశం గ‌ణ‌తంత్య్ర దేశంగా ఆవిర్భ‌వించ‌లేదు. అంత గొప్ప త్యాగాల‌కు గుర్తు. స్వాతంత్య్ర ఉద్య‌మ కారులు ఎంతో త్యాగం చేశారు. కానీ రాను రాను.. పాలిటిక్స్‌లో దిగ‌జారుడుత‌నం వచ్చేసింది. హుందాత‌నం పోయింది. ఆ భావన‌ను ఓ క‌వి దాన్ని క‌విత‌గా రాస్తాడు. ఓ ద‌ర్శ‌కుడు దాన్ని సినిమాగా తెర‌కెక్కిస్తాడు. నీ స్వేచ్ఛ కోసం ఎంత ర‌క్తం పారిందో తెలుసుకో. అది నీ శరీర క్షేత్రంలో ధైర్యం చ‌ల్ల‌క‌పోతే, అది నీ గుండెల్లో ఆత్మ గౌర‌వం పండిచ‌క‌పోతే, నువ్వు ఎప్ప‌టికీ మోచేతి అంబ‌లి తాగే బానిస‌ల్లాగా బ‌త‌కాల‌ని అనుకుంటే.. ఆ చిందించిన ర‌క్తానికి ఎంత ద్రోహిగా మారావో తెలుసుకో’’శేషేంద్ర శ‌ర్మ‌గారు చెప్పారు. సినిమాల్లో విలువలు మాట్లాడటం ఒక ఎత్తైతే, దాన్ని నిజ జీవితంలో ముందుకు తీసుకెళ్ల‌డం ఎంతో క‌ష్ట‌త‌రం. అంటూ ఘాటైన వ్యాక్య‌త‌లతో విరుచుకుప‌డ్డారు ప‌వ‌న్‌