నాట్యం మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌

October 22, 2021

నాట్యం మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌

విడుదల తేదీ : అక్టోబర్ 22, 2021

నటీనటులు: సంధ్యారాజు, క‌మ‌ల్ కామ‌రాజు, రోహిత్ బెహ‌ల్‌, ఆదిత్య మీన‌న్‌, శుభ‌లేఖ సుధాక‌ర్‌, భానుప్రియ‌, బేబీ దీవ‌న త‌దిత‌రులు

దర్శకుడు: రేవంత్ కోరుకొండ‌

నిర్మాత: నిశ్రింక‌ళ ఫిల్మ్‌

సంగీత దర్శకుడు: శ్రవణ్ భ‌రద్వాజ్‌

ఎడిటర్: రేవంత్ కోరుకొండ‌

ప్రముఖ కూచిపూడి డ్యాన్స‌ర్ సంధ్యారాజు నటిస్తూ స్వయంగా నిర్మిస్తున్న సినిమా ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో నిశృంకళ ఫిల్మ్‌ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఈ రోజు(అక్టోబ‌రు 22)న ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. క్లాసిక‌ల్ నేప‌థ్యం కావ‌డం, చిరంజీవి, బాల‌కృష్ణ‌, వెంక‌టేష్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ లాంటి వారు ఈ సినిమాకు స‌పోర్ట్ చేయ‌డంతో ఆడియ‌న్స్‌లో ఈ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. మ‌రి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ:
నాట్యం అనే గ్రామంలో ఓ పురాత‌న ఆల‌యంలో నాట్య‌శాస్త్రానికి సంభందించిన కొన్ని గ్రంథాలు దొరుకుతాయి. దాంతో ఆ గుడి ప్రాచీర్యం పొందుతుంది. అదే ఊరిలో సితార(సంధ్యారాజు) అనే అమ్మాయి
నాట్యం అభ్యసిస్తూ ఉంటుంది. ఆమె గురువుగారి ద్వారా తెలుసుకున్న కాదంబ‌రి క‌థ‌ను నాట్యం ద్వారా చెప్ప‌డమే ఆమె ల‌క్ష్యం. సిటీలో ఉండే వెస్ట్ర‌న్ డ్యాన్స‌ర్ రోహిత్ అనే వ్యక్తితో అనుకోకుండా జరిగిన గొడవ కారణంగా తన గ్రామం నుండి బయటకు రావాల్సివ‌స్తుంది. సితార మ‌ళ్లీ త‌న స్వ‌గ్రామానికి వెళ్లి కాదంబ‌రి క‌థ‌ను ఆ గ్రామ‌స్తుల‌కి చెప్పి తన చిన్ననాటి కలను నెరవేర్చుకుంటుందా? ఇంత‌కీ ఆ కాదంబ‌రి ఎవ‌రు? ఆమె క‌థేంటి అనేది మిగ‌తా క‌థ‌.

స్వ‌త‌హాగా కూచిపూడి డ్యాన్స‌ర్ అవ‌డంతో సంధ్యారాజు డ్యాన్స్ ఈ సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా మొద‌టిపాట‌లో, చివ‌రిపాట‌లో ఆమె అభిన‌యం ఆక‌ట్టుకుంటుంది. అయితే యాక్టింగ్ విష‌యంలో మాత్రం పర్వాలేద‌నిపిస్తుంది. క‌మ‌ల్ కామ‌రాజు క్లాసిక‌ల్ డ్యాన్స్‌తో మెప్పించారు. చివ‌ర్లో విల‌నిజం పండించే ప్ర‌య‌త్నం చేశాడు. రోహిత్ న‌ట‌న‌లో మంచి ఈజ్ ఉంది. వెస్ట్ర‌న్ డ్యాన్స్ చాలా బాగా చేశాడు. క్యాస్టింగ్ ప‌రంగా రోహిత్ త‌న పాత్ర‌కి ప‌ర్ఫెక్ట్ ఛాయిస్‌. మిగ‌తా న‌టీన‌టులు వారి పరిధి మేర న‌టించారు.

కాదంబ‌రి క‌థ చెప్ప‌డంతో ప్రారంభ‌మైన ఈ సినిమా మొద‌టినుండి సాగ‌దీత‌గా అనిపిస్తుంది. సంధ్యారాజు ఎంట్రీ త‌ర్వాత కొంత గాడిలో ప‌డింది అనుకునేస‌రికి వెంట‌నే మళ్లీ క‌థ డీవీయేట్ అవుతుంది. అస‌లు ద‌ర్శ‌కుడు ఏం చెప్పాలి అనుకుంటున్నాడో ఆ పాయింట్ ని సరిగ్గా అందించలేకపోయారా అనే డౌట్ ప్రేక్ష‌కుల‌కి కలుగుతుంది. సెకండ్ హాఫ్ లో ఆధునిక నేపథ్యం మరింత స్పష్టంగా ఉంటుంది. అయితే ఇలాంటి సినిమాల‌కు ఎంతో కీల‌క‌మైన క్లైమాక్స్ స‌న్నివేశాలు కూడా అంత‌గా ఆక‌ట్టుకోవు. రేవంత్ త‌న మేకింగ్‌ స్టైల్ ని ఇంకాస్త బెటర్ ప్రజంట చేసి ఉంటే బావుండేది. ప్రస్తుతం ఉన్న ఫాస్ట్ జనరేషన్ కు నాట్యం సినిమాతో క్లిక్ అవ్వాలనుకోవడం ఒక ఛాలెంజ్ లాంటిది. అయితే ఈ సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడా మిక్స్ చేయడం వల్ల కాస్త సినిమాకి నమ్మకాన్ని ఇచ్చింది. ఈ కథకు సంబంధించి విభిన్నమైన అంశాల్ని మిస్ కాకుండా చూడాలని దర్శకుడు చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకోవచ్చు. అలాగే సంగీతం, సినిమాటోగ్రఫీ కూడా అక్క‌డ‌క్క‌డా ఆక‌ట్టుకుంటాయి.

బాట‌మ్ లైన్‌: క‌థ‌ను అర్థ‌మ‌య్యేలా చెప్ప‌క‌పోవ‌డం

CHITRASEEMA RATING : 2.25

Related News