August 13, 2021
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతోన్న లూసిఫర్ తెలుగు రిమేక్ చిత్రం షూటింగ్ ‘#చిరు 153’ అనే వర్కింగ్ టైటిల్‌తో శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్‌గుడ్ ఫిల్మ్స్ బ్యానర్స్‌పై నిర్మితమవుతోన్న ఈ సినిమా షెడ్యూల్ భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణతో ప్రారంభమైంది. మెగాస్టార్ చిరంజీవిపై ఈ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ నిరవ్‌షా విజువల్స్ అందిస్తున్న ఈ చిత్రానికి పలు బాలీవుడ్ చిత్రాలకు వర్క్ చేసిన సురేశ్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు.
యంగ్ మ్యూజిక్ సెన్సేషనల్ ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, తమన్ కాంబినేషన్లో రూపొందుతోన్న తొలి చిత్రంకావడంతో తమన్ చాలా ఎగ్జయిట్‌మెంట్‌తో స్వరాలను సమకూరుస్తున్నారు. ఇప్పటికే తమన్ ఓ సాంగ్ కంపోజిషన్‌ను కూడా పూర్తి చేయడం విశేషం.