సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమికా చావ్లా, తాన్య హోప్ నటించిన `ఇదే మా క‌థ` రిలీజ‌య్యేది ఎప్పుడంటే?

September 25, 2021

సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమికా చావ్లా, తాన్య హోప్ నటించిన `ఇదే మా క‌థ` రిలీజ‌య్యేది ఎప్పుడంటే?

ప్రపంచంలోని చాలా మంది వ్యక్తుల‌కు తమ కలల గమ్యస్థానానికి వెళ్లాలనే కోరిక ఉంటుంది. అలా విభిన్న నేపథ్యం ఉన్న నలుగురు బైక్‌ రైడర్లు తమ గమ్యానికి చేరుకునే మార్గంలో ఒకరికొకరు పరిచయమై ఒకరి గురించి మరొకరు ఏం తెలుసుకున్నారు? అనే ఆస‌క్తిక‌ర‌ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న చిత్రం ఇదే మా క‌థ‌.

సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమికా చావ్లా, తాన్య హోప్ ప్రధాన పాత్రల్లో న‌టించారు. గురు పవన్ దర్శకత్వంలో మహేష్ గొల్లా నిర్మించారు.

ఇటీవ‌ల విక్ట‌రీ వెంక‌టేష్ రిలీజ్ చేసిన కాన్సెప్ట్ టీజ‌ర్ ప్రేక్ష‌కుల నుండి విశేష‌ స్పంద‌న ల‌భిస్తోంది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని గాంధీ జ‌యంతి కానుక‌గా అక్టోబ‌రు 2 న‌గ్రాండ్ రిలీజ్ చేయ‌నున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు మేక‌ర్స్.

ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు. సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్, జునైద్ సిద్దిఖీ ఎడిటర్.