రాక్ష‌సుడిగా అశ్విన్‌బాబు..ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ వైర‌ల్‌

August 1, 2021

రాక్ష‌సుడిగా అశ్విన్‌బాబు..ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ వైర‌ల్‌

అశ్విన్ బాబు హీరోగా నటిస్తోన్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ‘హిడింబ‌’. అనీల్ కృష్ణ క‌న్నెగంటి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ విఘ్నేశ్ కార్తీక్ సినిమాస్‌(ఎస్‌.వి.కె.సినిమాస్‌) బ్యాన‌ర్‌పై గంగ‌ప‌ట్నం శ్రీధ‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అశ్విన్‌బాబు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. పోస్ట‌ర్‌ను చూస్తే .. అశ్విన్ త‌ల‌పై ర‌క్త‌పు చుక్క‌లు..చేతిలో ఇనుప చువ్వ‌ను ప‌ట్టుకుని మెలి తిప్పిన మీసాల‌తో క‌నిపిస్తున్నారు. సినిమా ఇప్ప‌టికే యాబై శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. నందితా శ్వేత హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి బి.రాజ‌శేఖ‌ర్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహిస్తున్నారు. ఈ చిత్రానికి వికాస్ బ‌డిసా సంగీతాన్ని అందిస్తున్నారు.

Related News