August 28, 2021
గోపీచంద్, తమన్నా హీరోహీరోయిన్లుగా సంపత్ నంది కాంబినేషన్‌లో తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా సీటీమార్ సెప్టెంబర్ 3న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే..అయితే తర్వాతి వారంలో రిలీజ్ కావాల్సిన లవ్‌స్టోరీ విడుదల వాయిదా వేసే ఆలోచనలో నిర్మాతలు ఉండడంతో సీటీమార్ సినిమా వినాయక చవితి అయిన సెప్టెంబర్ 10న థియేటర్స్‌లో విడులకానుంది. ఇక అదేరోజున నాని టక్ జగదీష్ కూడా అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.
గోపిచంద్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. భూమిక, బాలీవుడ్ యాక్టర్ తరుణ్ అరోరా కీలక పాత్రలలో నటించారు.